చిన్నికృష్ణతో అల్లరి నరేష్‌

చిన్నికృష్ణ అనగానే రచయిత చిన్నికృష్ణ అనుకునేరు, ఈ చిన్నికృష్ణ ‘వీడుతేడా’ డైరెక్టర్‌. నిఖిల్‌ హీరోగా వచ్చిన ‘వీడు తేడా’ పెద్ద సక్సెస్‌ అవలేదుగానీ, చిన్నికృష్ణకి మాత్రం దర్శకుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చింది. అదే, బాలకృష్ణతో…

చిన్నికృష్ణ అనగానే రచయిత చిన్నికృష్ణ అనుకునేరు, ఈ చిన్నికృష్ణ ‘వీడుతేడా’ డైరెక్టర్‌. నిఖిల్‌ హీరోగా వచ్చిన ‘వీడు తేడా’ పెద్ద సక్సెస్‌ అవలేదుగానీ, చిన్నికృష్ణకి మాత్రం దర్శకుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చింది. అదే, బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం చిన్నికృష్ణకు తెచ్చిపెట్టింది కూడా. అయితే, అనూహ్యంగా బాలకృష్ణతో సినిమా వాయిదా పడ్డంతో, ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేసేయాలనుకుంటున్నాడట చిన్నికృష్ణ.

దాంతో, అల్లరి నరేష్‌ని కలిసి కామెడీ నేపథ్యంలో ఓ మంచి సబ్జెక్ట్‌ చెప్పాడనీ, కథ నచ్చి చిన్నికృష్ణతో సినిమా చేయడానికి అల్లరి నరేష్‌ ఒప్పుకున్నాడనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందట.

డిసెంబర్‌లో సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందనీ, ఏప్రిల్‌ లేదా మేలో సినిమా విడుదల కాబోతోందనీ తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ఇతర తారాగణం ఎంపికలో చిన్నికృష్ణ బిజీగా వున్నట్లు సమాచారం.