ఎన్టీఆరా.. మహేషా?

‘అత్తారింటికి దారేది’ విడుదల కాకముందే ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయడానికి త్రివిక్రమ్‌ ఒక కొత్త నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్‌ తీసుకున్నాడు. అయితే ఆ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్‌తో చిత్రం చేస్తున్న…

‘అత్తారింటికి దారేది’ విడుదల కాకముందే ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయడానికి త్రివిక్రమ్‌ ఒక కొత్త నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్‌ తీసుకున్నాడు. అయితే ఆ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్‌తో చిత్రం చేస్తున్న త్రివిక్రమ్‌ త్వరలో పవన్‌తో మరోసారి టీమ్‌ అప్‌ అవనున్నాడు. ఇద్దరూ కలిసి స్వీయ నిర్మాణంలో ‘కోబలి’ చేస్తారు. 

అయితే అల్లు అర్జున్‌ సినిమాకీ, కోబలికీ మధ్య త్రివిక్రమ్‌ మరో చిత్రం చేస్తాడు. ఇది ఎన్టీఆర్‌తోనే ఉంటుందని వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా మహేష్‌తో త్రివిక్రమ్‌ మూవీ ఉంటుందనే ప్రచారం స్టార్ట్‌ అయింది. మహేష్‌కి బాగా క్లోజ్‌ అయిన త్రివిక్రమ్‌ ఇంతవరకు మహేష్‌తో అతడు, ఖలేజా చిత్రాలు తీశాడు. జల్సాకి మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ కూడా ఇచ్చాడు. 

ఖలేజా తర్వాత చాలా గ్యాప్‌ వచ్చింది కాబట్టి ఈ ఇద్దరు స్నేహితులు మళ్లీ జత కలిసి ఒక సినిమా చేద్దామని అనుకుంటున్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఆగడు పూర్తయిన వెంటనే కొరటాల శివ చిత్రాన్ని చేయబోతున్న మహేష్‌ దీనికోసం ఎప్పటికి రెడీగా ఉంటాడనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఏదైతేనేమి మరోసారి ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ సినిమా సస్పెన్స్‌లో పడింది.