చరణ్‌ కోసం వేట

రామ్‌ చరణ్‌తో కృష్ణవంశీ చేయబోయే చిత్రంలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. చరణ్‌ సరసన కాజల్‌ నటిస్తుందని వార్తలొచ్చాయి కానీ అందులో నిజం లేదని తేలింది. ప్రస్తుతం కృష్ణవంశీ ఈ చిత్రం కోసం…

రామ్‌ చరణ్‌తో కృష్ణవంశీ చేయబోయే చిత్రంలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. చరణ్‌ సరసన కాజల్‌ నటిస్తుందని వార్తలొచ్చాయి కానీ అందులో నిజం లేదని తేలింది. ప్రస్తుతం కృష్ణవంశీ ఈ చిత్రం కోసం హీరోయిన్‌ వేటలో ఉన్నాడు. చరణ్‌ సరసన ఒక అచ్చ తెలుగు పల్లెటూరు అమ్మాయి నటిస్తుందట. ఇందుకోసమే కృష్ణవంశీ అన్వేషిస్తున్నాడట. 

వెంకటేష్‌ సరసన నయనతార నటిస్తుందని వార్తలొచ్చాయి కానీ ఇంకా ఆమె ఈ చిత్రానికి సంతకం చేయలేదు. అసలు ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందా, ఉండదా అనే తర్జనభర్జనల మధ్య చివరకు ఓకే అయిన ఈ చిత్రం ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉంది. అన్నీ సెట్‌ అయిన తర్వాత డిసెంబర్‌ నెలాఖరులో లేదా జనవరిలో సెట్స్‌ మీదకి వెళుతుంది. 

ఈలోగా ‘ఎవడు’ రిలీజ్‌ కానుంది కాబట్టి దాని ప్రమోషన్‌ కార్యక్రమాలతో చరణ్‌ బిజీ కానున్నాడు. వెంకటేష్‌, చరణ్‌తో కృష్ణవంశీ తన ట్రేడ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ప్లాన్‌ చేశాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్‌ లేదా దసరాకి విడుదల అవుతుందట.