రేసుగుర్రం రేసులో లేదా?

బ‌న్నీ రేసు గుర్రం సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకొందా?  ముగ్గుల పండ‌క్కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావ‌డం లేదా??  అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. అల్లు అర్జున్ – సురేంద‌ర్ రెడ్డి క‌ల‌యిక‌లో…

బ‌న్నీ రేసు గుర్రం సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకొందా?  ముగ్గుల పండ‌క్కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావ‌డం లేదా??  అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. అల్లు అర్జున్ – సురేంద‌ర్ రెడ్డి క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఈ సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకొన్నారు. 

అయితే అప్పటికి సినిమా పూర్తయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచార‌మ్‌. దానికి తోడు సంక్రాంతి బ‌రిలో చాలా సినిమాలున్నాయి. థియేట‌ర్ల స‌మ‌స్య ఉత్పన్నమ‌య్యే అవ‌కాశాలున్నాయి. ఆద‌రాబాద‌ర‌గా సినిమా ముగించేసి, విడుద‌ల‌చేయ‌డం రిస్క్ అని చిత్రబృందం భావిస్తోంద‌ట‌. సంక్రాంతి బ‌రి నుంచి ఏవైనా కొన్ని సినిమాలు త‌ప్పుకొంటే అప్పుడు రేసు గుర్రం రేసులో నిల‌బ‌డే అవ‌కాశాలున్నాయి. 

అయితే అప్పటికి షూటింగ్ పూర్తవ్వాలి క‌దా..?   చిత్ర బృందం మాత్రం మా సినిమా సంక్రాంతి పండ‌గే లక్ష్యంగా రూపుదిద్దుకొంటోంది అని చెబుతోంది. మ‌రి ఈ సినిమా పండ‌క్కి వ‌స్తుందో లేదో చూడాలి.