రాను రాను ప్రేక్షకుల అభిరుచి చూస్తుంటే, సీనియర్ హీరోలు ఇంక తట్టా బుట్టా సర్దేసుకోవడం బెటర్ అనిపిస్తోంది. మొన్నటికి మొన్న నాగార్జున కు కాస్త బెటర్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ వెంకటేష్ మసాలాకు అదీ లేదు. రామ్-వెంకీల మల్టీస్టారర్ గా నానా హడావుడి చేసినా, ఎప్పటిలా కాకుండా వెంకటేష్ సినిమా ప్రీ పబ్లిసిటీ వ్యవహారంలో చాలా హుషారుగా పాల్లొన్నా ఓపెనింగ్స్ వరకు వచ్చేసరికి పరిస్థితి అంతంత మాత్రం అయిపోయింది.
మల్టీఫ్లెక్స్ ల్లో యాభై శాతం మాత్రమే కలెక్షన్లు వచ్చాయిని భోగట్టా. అలాగే ఉత్తరాంధ్రలో విడుదలైన సగం థియేటర్లు ఫుల్ కాలేదని అంటున్నారు. పైగా సినిమాకు పాజిటివ్ సంగతి పక్కన పెడితే, మరీ బిలో ఏవరేజ్ టాక్ రావడంతో, రేపటి నుంచి పరిస్థితి ఎలా వుంటుందో అని బయ్యర్లు చూస్తున్నారు. పరిస్థితి ఇలా వుంటే ఇకపై యంగ్ హీరోలకు తప్ప ఓపెనింగ్స్ తో గేమ్ ఆడ్డం సాధ్యం కాదు. సినిమా తీసి, హైప్ తీసుకువచ్చి, మొదటి మూడు రోజుల్లో కలెక్షన్లు నొల్లేసుకుందాం అంటే అందరికీ కుదిరే పని కాదని అర్థం అయిపోతోంది.