సచిన్ టెండూల్కర్.. పరిచయం అక్కర్లేని పేరిది. ప్రత్యర్థి జట్లలోనూ సచిన్ టెండూల్కర్‌కి వీరాభిమానులుంటారు. అదీ అతని గొప్పతనం. క్రికెట్‌లో వివాదాలకు దూరంగా వుండే వ్యక్తి ఎవరన్నా వుంటే, ముందు వరుసలో పేరు సచిన్‌దే వుంటుంది. దటీజ్ సచిన్.
పరుగుల రికార్డులు సచిన్‌కి కొత్తేమీ కాదు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు సచిన్‌వే. వన్డేల్లో ఇప్పటికే అత్యధిక మ్యాచ్‌ల రికార్డ్ తన పేర రాసుకున్న సచిన్, టెస్టుల్లోనూ అత్యధిక మ్యాచ్‌ల రికార్డు కూడా తానే సృష్టించాడు. తాజాగా 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా టెస్టుల్లో సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు.
వెస్టిండీస్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్‌తో సచిన్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పనున్న విషయం విదితమే. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, 182 పరుగులకే చాప చుట్టేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. సచిన్ క్రీజ్‌లో వున్నాడు ప్రస్తుతం. తొలిరోజు ఆట ముగిసే సమయానికి సచిన్ 38 పరుగులతో క్రీజ్‌లో వున్నాడు. టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
సచిన్ ఒక్కో బంతినీ ఎదుర్కొంటోంటే స్టేడియంలో అభిమానులు క్లాప్స్, విజిల్స్‌తో హోరెత్తించేశారు. సచిన్ కుటుంబం అంతా ఈ మ్యాచ్‌ని తిలకించేందుకు రావడం మరో విశేషం. అభిమానుల ఆనందం ఓ పక్క, నిలకడైన సచిన్ బ్యాటింగ్ ఇంకోపక్క.. వెరసి మైదానంలో వాతావరణం అద్భుతంగా వుందనే చెప్పాలి.
తనకు మాత్రమే సాధ్యమైన షాట్స్‌తో సచిన్ అభిమానుల్ని అలరించాడు. తొలి మ్యాచ్‌లో నిరాశపర్చినా, చిట్టచివరి మ్యాచ్ అయిన రెండో టెస్ట్‌లో సచిన్ కాన్ఫిడెంట్‌గా కన్పిస్తున్నాడు. సచిన్ బౌండరీలు బాదుతోంటే.. మైదానంలో హోరు గురించి చెప్పడం కష్టం.. అది స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది.
గవాస్కర్, కపిల్‌దేవ్, ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీ, కుంబ్లే.. ఇలా మేటి క్రికెటర్లు క్రికెట్‌కి గుడ్ బై చెప్పినా, సచిన్ విషయంలో మరీ ప్రత్యేకంగా ఫీలవుతున్నారు క్రికెట్ అభిమానులు. అదీ క్రికెట్‌లో సచిన్ సంపాదించుకున్న గొప్పతనం.