శ్రీకాంత్ అడ్డాలని గోదావరి సెంటిమెంట్ దట్టంగా ఉన్నట్టుంది. తను గోదావరి జిల్లావాడే. తన తొలి సినిమా కొత్త బంగారులోకం ఆ చుట్టుపక్కలే తీశాడు. రెండో సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా అక్కడే తెరకెక్కించాడు.
మూడో సినిమా గోల్లభామ కథ కూడా గోదావరి నేపథ్యంలోనే సాగుతుందట. ఈ సినిమాని భీమవరం లో మొదలుపెడతారట. అక్కడే సింహభాగం సినిమా తీసేస్తారట. సినిమా విషయంలోనే కాదు, సంభాషణల్లోనూ గోదావరి యాసే వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు వరుణ్ తేజ్ గోదావరి యాస మాట్లాడడం నేర్చుకొంటున్నాడట.
ఈ విషయంలో శ్రీకాంత్ అడ్డాల కొత్త హీరోకి తర్పీదు ఇస్తున్నాడట. వంశీ తరవాత గోదావరి పై అంత మమకారం చూపించే దర్శకుడు శ్రీకాంతేనేమో..?? ఈ సెంటిమెంట్ ఇక్కడితో ఆపేస్తాడా, లేదంటే భవిష్యత్తులోనూ కొనసాగిస్తాడా?? ఏమో… మరి!