రామయ్యా వస్తావయ్యా షాక్ నుంచి ఎన్టీఆర్ ఇంకా తేరుకోలేదు. ఓ ఫ్లాప్ వచ్చినా… ఆ సినిమతో కొన్ని పాఠాలు నేర్చుకొన్నాడు ఎన్టీఆర్. హిట్టు సినిమా డైరెక్టర్ అని చెప్పి… గుడ్డిగా ఫాలో అవ్వకూడదని నిర్ణయించుకొన్నాడు. ఇది వరకు ఎన్టీఆర్ కథ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకొనేవాడు కాదట.
తన అభిప్రాయాలు, మార్పులు, చేర్పులూ అన్నీ స్క్రిప్టు దశలోనే. సెట్‌కి వచ్చిన తరవాత ఇలా చేయ్, అలా చేయ్ అంటూ ఆర్డర్లు వేసేవాడు కాదట. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారిందని టాక్. సంతోష్ శ్రీనివాస్ సినిమాని ఎన్టీఆర్ వీర లెవిల్లో కెలికేస్తున్నాడని టాక్. ఈ కెలుకుడు అటు దర్శకుడు శ్రీనివాస్‌నీ, ఇటు నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌నీ తెగ ఇబ్బంది పెడుతోందని సమాచారమ్.
అయినా స్టార్ హీరో కాబట్టి సైలెంట్‌గా భరిస్తున్నారట. స్టార్ హీరోగా తన కథపై, సినిమాపై ఈమాత్రం జోక్యం చేసుకోవడం మంచిదే. అయితే… అది మరీ ఎక్కువైతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్టీఆరూ… కాస్త జోరు తగ్గించు…!