నైజాం లో అబ్బాయిని కొట్టిన బాబాయ్

తెలుగు సినిమా మార్కెట్ కు నైజాం  ఏరియానే పెద్ద మార్కెట్. నైజాం లో సినిమా రిలీజ్ అయితేనే మిగితా చోట్ల రిలీజ్ అయినట్టు. నైజాం లో హిట్ అని టాక్ వస్తే ఆ సినిమా…

తెలుగు సినిమా మార్కెట్ కు నైజాం  ఏరియానే పెద్ద మార్కెట్. నైజాం లో సినిమా రిలీజ్ అయితేనే మిగితా చోట్ల రిలీజ్ అయినట్టు. నైజాం లో హిట్ అని టాక్ వస్తే ఆ సినిమా పెద్ద హిట్ అయినట్టు. ఇప్పటి వరకు నైజాం లో అత్యధిక కలెక్షన్లు ఉన్నవి రామ్ చరణ్ కు మాత్రమే . 

అయితే ఇప్పుడు అబ్బాయిని బాబాయ్ కొట్టాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మగధీర నైజాం కలెక్షన్స్ 24 కోట్లు ఉండగా , అత్తారింటికి దారేది సినిమా నైజాం కలెక్షన్స్ 25 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంచనా అవేస్తున్నాయి. అంటే మగధీర కంటే కోటి రూపాయలు ఎక్కువగా పవన్ కలెక్ట్ చేశారని తెలుస్తోంది. ఈ లెక్కలే నిజమైతే మగధీర రికార్డ్ పవన్ కళ్యాన్ కొట్టినట్టే మరి.