డైరెక్టర్ వి.వి. వినాయక్ అంటే పవర్‌ఫుల్ మాస్ సినిమాలకి పెట్టింది పేరు. ఆయన సినిమాలంటే ఫ్యాక్షన్ గొడవలు, సుమోలు గాల్లోకి లేవడాలు ఉంటాయి. అయితే వినాయక్ అసలు ఇలాంటి సినిమాలు తీయాలని ఏనాడూ అనుకోలేదట. తన ఆలోచనలు ఎప్పుడూ క్లాసికల్ సినిమాల మీద ఉండేదట. మణిరత్నంలా హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీస్ తీయాలని కలలు కనే వాడట.
అతని ఆలోచనల్లో కూడా ఎక్కువ అలాంటి కథలే తిరిగేవట. కానీ ‘ఆది’ మొత్తం మార్చేసిందని, ఆ సినిమా తర్వాత ఇక అంతా తనని అలాంటి సినిమాలే అడగడం మొదలుపెట్టారని, ఇక తప్పక తనని తాను మాస్ డైరెక్టర్‌గా మలుచుకోవాల్సి వచ్చిందని వినాయక్ చెప్పాడు. ఎన్టీఆర్‌కి కూడా వినాయక్ ముందుగా ‘ఆది’ కథ చెప్పలేదంట. ఒక లవ్‌స్టోరీ నెరేట్ చేస్తే, తాను ఇలాంటి కథలు చేయాలని అనుకోవడం లేదని, ఏదైనా మాస్ సబ్జెక్ట్ ఉంటే తీసుకురమ్మని ఎన్టీఆర్ చెప్పాడట.
దాంతో వినాయక్ అప్పటికప్పుడు ఆది కథ రాసుకుని వెళ్ళి ఎన్టీఆర్‌కి వినిపించాడు. తర్వాత ఏమి జరిగిందనేది మన అందరికీ తెలుసు. ఒకవేళ ఎన్టీఆర్ అప్పుడే వినాయక్ చెప్పిన లవ్‌స్టోరీ యాక్సెప్ట్ చేసి ఉంటే వినాయక్ ఎలా ఉండేవాడో, అసలు ఎన్టీఆర్ ఏ టైప్ ఇమేజ్ తెచ్చుకునేవాడో? ఆది వల్లే ఎన్టీఆర్‌కి తిరుగులేని మాస్ ఇమేజ్ వచ్చేసి మాస్ హీరోగా సెటిలైన సంగతి తెలిసిందే.