ఎన్టీఆర్‌ కోసం వెయిట్‌ చెయ్యలేక

‘స్వామిరారా’ చిత్రంతో పరిచయమైన దర్శకుడు సుధీర్‌ వర్మ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడనేది తెలిసిందే. డైరెక్టర్స్‌ ఫిలింగా కితాబులు అందుకున్నఆ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఆ చిత్రం వచ్చి ఇన్ని నెలలు…

‘స్వామిరారా’ చిత్రంతో పరిచయమైన దర్శకుడు సుధీర్‌ వర్మ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడనేది తెలిసిందే. డైరెక్టర్స్‌ ఫిలింగా కితాబులు అందుకున్నఆ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఆ చిత్రం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కానీ సుధీర్‌ వర్మ ఇంతదాకా ఇంకో సినిమా మొదలు పెట్టలేదు. ఎన్టీఆర్‌తో సినిమా కన్‌ఫర్మ్‌ అయిందని వార్తలొచ్చాయి కానీ అది సెట్స్‌ మీదకి వెళ్లలేదు.

సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో నటించడానికి ఆసక్తి చూపించిన ఎన్టీఆర్‌ వేరే కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్‌ కోసం వేచి చూడాలంటే మరో ఏడాది వేస్ట్‌ అయిపోతుందని గ్రహించిన సుధీర్‌ వర్మ ఈలోగా నాగ చైతన్యతో ఒక సినిమా చేయబోతున్నాడు. మరి ఎన్టీఆర్‌తో చేద్దామనుకున్న కథతోనే చైతన్యతో చేస్తాడా లేక ఇతని కోసం ఇంకో కథ రెడీ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్‌, సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నానని ప్రకటించిన బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సో.. ఇప్పటికి ఎన్టీఆర్‌, సుధీర్‌ కాంబినేషన్‌ మూవీ లేనట్టే అనుకోవచ్చు. చైతన్యతో కూడా హిట్‌ కొట్టినట్టయితే మాత్రం సుధీర్‌వర్మ డిమాండ్‌ అమాంతం రెట్టింపవుతుంది.