దగ్గుబాటి రాణా ఇంకా తెలుగులోనే హీరోగా తనేంటో నిరూపించుకోలేదు. శేఖర్ కమ్ముల, క్రిష్‌లాంటి మంచి దర్శకులతో పని చేసినా కానీ రాణా హీరోగా ఎలాంటి పేరు తెచ్చుకోలేదు. ప్రస్తుతం వేరే హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లేస్తున్న రాణా త్వరలో సోలో హీరోగా ఓ చిత్రం చేయబోతున్నాడు.
‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాణా హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుంది. దీనిని తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కించమని రాణా కోరాడు. బాలీవుడ్‌లో తనకి మార్కెట్ ఉందని రాణా ఫీల్ అవుతున్నాడు. తనని బాలీవుడ్ సెలబ్రిటీగా అక్కడి మీడియా గుర్తించిందనే భ్రమలో రాణా ఉన్నాడు.
తాను సోలో హీరోగా నటించినా కానీ హిందీలో సినిమా చెల్లుబాటు అవుతుందని రాణా భావిస్తున్నాడు. అందుకే ఈ చిత్రంలో ఖచ్చితంగా హిందీలో బాగా పేరున్న హీరోయిన్‌ని తీసుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. అతని కోరిక మన్నించి బాలీవుడ్‌లో పాపులర్ అయిన హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. బాలీవుడ్ మీద రాణాకి ఇంకా మోజు తగ్గలేదనే సంగతి దీనిని బట్టి స్పష్టమవుతోంది. ఈ సినిమాతో అయినా అతనికి అంతో ఇంతో పేరు అక్కడా, ఇక్కడా వస్తే మంచిదే.