‘గబ్బర్‌సింగ్’ తర్వాత స్టార్ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న హరీష్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్యా’ పరాజయంతో తన నెక్స్ట్ సినిమా ఏమిటనేది కూడా తెలియని పొజిషన్లో ఉన్నాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ ఊహించిన దానికంటే పెద్ద ఫ్లాప్ కావడంతో ఇప్పుడు హరీష్ తదుపరి చిత్రం పూర్తిగా డౌట్లో పడిరది.
అల్లు అర్జున్‌తో అతని మలి చిత్రం ముందుగానే ఫిక్స్ అయింది. ఈ కారణంగానే ‘గబ్బర్‌సింగ్’ సీక్వెల్‌కి కూడా హరీష్ ఓకే చెప్పలేకపోయాడు. అతను బిజీగా ఉన్నానని చెప్పడం వల్లే సంపత్ నందికి పవన్ అవకాశమిచ్చాడని టాక్ ఉంది. దీనిని బట్టి అల్లు అర్జున్‌తో కమిట్ కావడం వల్ల హరీష్ ‘గబ్బర్‌సింగ్ 2’ మిస్ అయ్యాడనే అనాలి.
తీరా ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ అయ్యేసరికి హరీష్‌పై అల్లు అర్జున్ పూర్తి కాన్ఫిడెన్స్‌తో లేడు. ‘రేసుగుర్రం’ తర్వాత హరీష్‌తోనే సినిమా చేయాల్సిన వాడల్లా ఇప్పుడు త్రివిక్రమ్‌తో నెక్స్ట్ సినిమా చేయడానికి ఓకే అనేశాడు. మరి హరీష్ శంకర్‌తో చేస్తానన్న సినిమా ఏమైనట్టు? తొందర్లో అతడికి నచ్చే కథ చెప్పినట్టయితే త్రివిక్రమ్ సినిమా తర్వాత అర్జున్ ఈ సినిమా చేస్తాడంట. లేదంటే హరీష్ ఇంకో హీరోని వెతుక్కోవాల్సిందేనట.