మారుతికీ పవనే కావాలట

ఒకప్పుడు పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతీ దర్శకుడీ టార్గెట్‌ .. 'చిరంజీవితో ఒక్క సినిమా అయినా తీయాలి…' అనే. ఇప్పుడు చిరంజీవి శకం దాదాపుగా ముగిసిపోవడంతో… ఆ స్థానంలోకి పవన్‌ కల్యాణ్‌ వచ్చాడు. 'పవన్‌తో సినిమా'…

ఒకప్పుడు పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతీ దర్శకుడీ టార్గెట్‌ .. 'చిరంజీవితో ఒక్క సినిమా అయినా తీయాలి…' అనే. ఇప్పుడు చిరంజీవి శకం దాదాపుగా ముగిసిపోవడంతో… ఆ స్థానంలోకి పవన్‌ కల్యాణ్‌ వచ్చాడు. 'పవన్‌తో సినిమా' అనగానే ఎగిరి గంతేసి క్యూలో నిలబడే దర్శకులు ఎంతమందో…? 

 ఈ జాబితాలో మారుతి కూడా చేరిపోయాడు. 'పవన్‌ తో ఎప్పటికైనా సినిమా తీయాల్సిందే' అని శపథం బూని మరీ సినిమాల్లోకి అడుగుపెట్టాడట మారుతి. అంతేకాదు…పవన్‌ కోసం ఓ కథ కూడా సిద్ధం చేశాడు. 

అదే 'కొణెదల ఎల్‌ ఎల్‌ బీ'. ఈ సినిమాలో పవన్‌ని ఓ మాస్‌ లాయర్‌గా చూపించాలనుకొంటున్నాడు. మారుతికి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్నాయి. అల్లు అరవింద్‌, బన్నీ అయితే మహా క్లోజు. పవన్‌ ములాఖాత్‌ మాత్రం కాలేదు. అయితే పవన్‌కి కథ చెప్పేసి ఒప్పించేద్దుడేమో..?