ముక్కుతూ, మూలుగుతూ ముందుకు వెళ్తున్న ఆటోనగర్ సూర్య కి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. మధ్యలో ఆగిపోయిన ఈసినిమాని మొత్తానికి అయ్యిందనిపిస్తున్నారు. ఇప్పటికి 90 శాతం సినిమా పూర్తయిందట.
మిగతా సినిమానీ వీలైనంత త్వరగా లాగించేసి డిసెంబరులో ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు. దానికి తోడు ప్రచార కార్యక్రమాలనూ మొదలు పెట్టబోతున్నారు. దానికి చైతూ బర్తడేను వేదిక చేసుకొన్నారు. ఈనెల 23న నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు.
డిసెంబరు మొదటి వారంలో పాటల్నీ వినిపించబోతున్నార్ట. ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయిన ఈ సినిమాని రంగులు పూస్తున్నారంతా. మరి నాగచైతన్య, సమంతల జోడీ ఈ సినిమాకి గ్లామర్ అద్దుతారేమో చూడాలి.