తన గ్లామర్ తగ్గి, బరువు పెరగగానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి నిలిపింది చార్మి. అయితే ఆసినిమాల నుంచి మైలేజ్, పాపులారిటీ రావనే సంగతి తెలుసుకొంది. ఇప్పుడు మళ్లీ యధావిధిగా గ్లామర్ పాత్రలవైపు దృష్టి నిలిపింది. అయితే అలాంటి అవకాశాలు అంత సులభంగా రావుకదా..? అందుకే బాగా స్లిమ్ అయ్యింది.
ఎనిమిది కిలోలు తగ్గింది. బాగా తగ్గిన విషయం పిల్మ్ నగర్ జనాలకు తెలియాలి కదా..? అందుకే ఓ ఫొటో షూట్ చేసుకొని.. ఆ స్టిల్స్ విడుదల చేసింది. ఇప్పుడు పూరి, వర్మ క్యాంపుచుట్టూ తిరుగుతోంది ఛార్మి. వాళ్ల రికమెండేషన్లతో చాన్సులు దక్కించుకోవాలనేమో..? ప్రత్యేక గీతాల్లోనూ నటించడానికి సై అంటోంది.
నాయక్ సినిమాలో రామ్ చరణ్‌తో చిందేసిన తరవాత మళ్లీ స్పెషల్ సాంగ్స్ రాలేదు. అప్పటి కంటే ఇప్పుడే బాగుంది ఛార్మి…. మరి మరింత అందంగా తయారైన ఛార్మి తాపత్రయం అర్థం చేసుకొనైనా, నిర్మాతలు అవకాశాలిస్తారో లేదో…?