కంగనాను కాంట్రవర్సీల్ని వేరు చేసి చూడలేం. కంగనా ఎక్కడుంటే వివాదాలు అక్కడుంటాయి. ఇప్పుడీ వివాదాల రాణి మరో దుమారం రేపింది. పరోక్షంగా రణబీర్ కపూర్, అలియా భట్ జోడీపై విమర్శలు స్టార్ట్ చేసింది. కంగనా విమర్శలు చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈసారి కూడా అంతే ఘాటుగా ఉన్నాయి ఈమె వ్యాఖ్యలు.
“ఓ నకిలీ భార్యభర్త ఉన్నారు. ఒకే అపార్ట్ మెంట్ లో వేర్వేరు ఫ్లోర్స్ లో ఉంటారు. సినిమాల ప్రకటనలపై ఫేక్ న్యూస్ సృష్టిస్తుంటారు. మింత్రా బ్రాండ్ తమ సొంతం అనుకుంటారు. భార్యబిడ్డను వదిలేసి విదేశాలకు వెళ్తాడు, ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పుకుంటాడు. దయచేసి ఓసారి కలవాలంటూ నాకు మెసేజీలు పెడతాడు. ఈ నకిలీ జోడీని బయటపెట్టాల్సిన అవసరం ఉంది.”
ఇలా చాలా పెద్ద పోస్టు పెట్టింది కంగనా. ఆమె ఈ పోస్టు పెట్టగానే అది రణబీర్-అలియాను ఉద్దేశించిందనే విషయం అందరికీ తెలిసిపోయింది. రీసెంట్ గా తన తల్లి పుట్టినరోజు వేడుక కోసం లండన్ వెళ్లాడు రణబీర్. కానీ భార్యబిడ్డను తీసుకెళ్లలేదు. ఇక మింత్ర బ్రాండ్ అంబాసిడర్ ఎవరనేది కూడా తెలిసిందే. కంగనా అక్కడితో ఆగలేదు.
ప్రేమ కోసం కాకుండా డబ్బు కోసం, సినిమా అవకాశాల కోసం, ప్రచారం కోసం పెళ్లిళ్లు చేసుకుంటే ఇలానే ఉంటుందంటూ మరో పోస్టు పెట్టింది కంగనా. మాఫియా డాడీ ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకున్న ఆ హీరో.. ఇప్పుడా ఫేక్ మ్యారేజ్ నుంచి బయటపడేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడంటూ బాంబ్ పేల్చింది.
అయితే ఆ హీరోను ఓదార్చేందుకు హీరోయిన్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదని, ఇకనైనా అతడు తన భార్య, బిడ్డపై ఫోకస్ పెట్టి జీవితాన్ని కొనసాగిస్తే బాగుంటుందంటూ ఉచిత సలహా ఇచ్చింది కంగనా.