విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు కేవలం ఇరవై ఏడేళ్ల ప్రాయంలోనే దేశం కోసం పోరాడుతూ అసువులు బాసారు. తనకంటూ ఏమీ చూసుకోకుండా నిస్వార్ధంగా ఆయన పేదల కోసం పనిచేశారు. గిరిజనుల పక్షాన నిలబడి నాటి ఆంగ్లేయులను గడగడలాడించారు. అల్లూరి నాలుగేళ్ల పాటు అలుపెరగకుండా పోరాటం చేసి వారికి ముచ్చెమటలు పోయించారు.
ఇంతలా అల్లూరి ఎన్నో వీరోచిత కార్యక్రమాలు చేసినా ఆయనకు సంబంధించిన చరిత్ర మాత్రం అసలైనది పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు అన్న బాధ ఆయన అభిమానులలో ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం అల్లూరి యువజన సంఘం ఏర్పాటు చేసి ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తూ ఆయన జీవిత చరిత్ర గురించిన అసలు వాస్తవాలను తెలియచేసే పనిలో వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఉన్నారు.
పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి చుట్టూ ఎంతో మంది ఎన్నో కట్టుకధలు అల్లారని, కానీ వాస్తవాలు తెలియచెప్పే ప్రయత్నం అయితే ఇప్పటిదాకా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశరు. అల్లూరి జీవిత చరిత్ర మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరగాల్సి ఉంది అని అన్నారు.
విశాఖకు చెందిన రాజా సత్యనారాయణరాజు అల్లూరి మీద ఒక చిత్రాన్ని నిర్మించారు. ఒక్కడే వీరుడు అల్లూరి సీతారామరాజు అన్న పేరుతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న విడుదల చేస్తున్న. ఈ చిత్రంలో అల్లూరికి సంబంధించి తెలుగు జాతికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అల్లూరి సినిమా అనగానే సూపర్ స్టార్ క్రిష్ణ నటించిన సినిమాయే గుర్తుకు వస్తుంది. ఒక్కడే వీరు అల్లూరిలో చాలా కొత్త విషయాలు ఉన్నాయని నిర్మాతలు అంటున్నారు. దేశమంతా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.