గాయపడిన హీరో.. ఆగిన షూటింగ్

కన్నప్ప సినిమా షూటింగ్ లో హీరో మంచు విష్ణు గాయపడ్డాడు. వెంటనే అతడ్ని హుటాహుటిన సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. న్యూజిలాండ్ లో జరిగింది ఈ ఘటన. Advertisement విష్ణు కలల ప్రాజెక్టు…

కన్నప్ప సినిమా షూటింగ్ లో హీరో మంచు విష్ణు గాయపడ్డాడు. వెంటనే అతడ్ని హుటాహుటిన సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. న్యూజిలాండ్ లో జరిగింది ఈ ఘటన.

విష్ణు కలల ప్రాజెక్టు కన్నప్ప. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను న్యూజిలాండ్ లో ప్రారంభించాడు విష్ణు. సినిమా మ్యాగ్జిమమ్ షూటింగ్ ను అక్కడే పూర్తి చేయాలనేది ప్లాన్. ఇందులో భాగంగా ఓ డ్రోన్ షాట్ తీస్తున్నారు. ఉన్నట్టుండి సడెన్ గా డ్రోన్ కుప్పకూలింది. నేరుగా వచ్చి విష్ణుపై పడ్డంతో అతడి చేతికి పలు గాయాలయ్యాయి.

విష్ణు గాయాల బారిన పడ్డంతో కన్నప్ప షూటింగ్ ఆగిపోయింది. అయితే అతడికి తగిలిన గాయాలు తీవ్రమైనవా, లేక స్వల్ప గాయాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నాడు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం అందిస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇతడితో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హీరోయిన్ నయనతార కూడా ఓ పాత్రలో మెరిసే అవకాశం ఉంది.