ఒక పక్క తనంటే కిట్టని వర్గంతో కనిపించని పోరు, మరోపక్క తనంటే విపరీతంగా అభిమానించే జనం ఇదీ జూనియర్ ఎన్టీఆర్ బ్యాలెన్స్ షీట్. గత రెండు సినిమాలకు ఇదే పరిస్థితి. సినిమాలు ఆ మాత్రం ఈ మాత్రం బాగున్నా కూడా కావాలని భారీ సంఖ్యలో ఎస్ఎవ్ుఎస్ లు ఇవ్వడం ’వృత్తి’ పెటుకున్న జనాలు. కానీ వీటన్నింటికీ అతీతంగా సాలిడ్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఎన్టీఆర్ ఈసారి.
అందుకే హరిష్ శంకర్ ఎలా చెబితే అలా చేసాడట. పైగా ఈ సారి ’రామయ్యా వస్తావయ్యా’ ప్రచారం కూడా కాస్త డిఫరెంట్ గా సాగుతోంది. సాధారణంగా పెద్ద సినిమాల విడుదలకు ముందు ఒక్కటి, తప్పితే రెండు టయిలర్లు విడుదల చేస్తారు. అవి కూడా అలా అలా పైపైన సినిమాను టచ్ చేస్తూ సాగుతాయి తప్ప సినిమా లోతుల్లోకి పోవు. కానీ ’రామయ్యా వస్తావయ్యా’ టయిలర్లు, సినిమా విడుదలకు ముందే దాన్ని యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జనం ముందు నిలబెట్టాయి.
పైగా దిల్ రాజుకు మీడియాకు సహజంగా కాస్త గ్యాప్ ఎక్కువ. కానీ ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు హరీష్ శంకర్ తగిన చొరవతో మీడియాతో మంచి సంబంధాలు కొనసాగించే కార్యక్రమం పెట్టకున్నారు. సినిమా గురించి మీడియా మితులందరికీ ఓపిగ్గా వివరించుకునే కార్యక్రమం చేపట్టారు. ఒక విధంగా నిర్మాత కన్నా ఎక్కవగా సినిమా పమోషన్ కోసం దర్శకుడు కష్టపపడం ఇటీవలి కాలంలో ఇదేనేమో?
పైగా సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు సినిమాలో వుంటే, ఒకరు ఓ మాదిరి హీరోయిన్ వుండడం సహజం. అలాంటిది ఈ సినిమాకు ఇధ్దరు పెద్ద హీరోయిన్లు. ఇది కూడా హరిష్ చేతివాటమే. తన వ్యక్తిగత పలుకుబడి వాడి, శృతిని సెకెండ్ హీరోయిన్ పాత్రకు అంగీకరింపచేసారు. అక్కడితో ఆగకుండా సినిమా పూర్తి అవుతున్నపుడే పలు రకాలుగా హైప్ తీసుకురావడానికి కూడా హరీష్ ప్రయత్నించారు. యూట్యూబ్ లో పాట మేకింగ్ కు సబంధించిన విడియో విడుదలచేయడం కూడా పనికి వచ్చింది. మొత్తానికి ఎన్టీఆర్ కు ’రామయ్య’ రక్ష అనుకుంటే, ’రామయ్యా వస్తావయ్యా’కు హరీష్ రక్షగా మారాడు.