లవ్‌లెటర్‌: తుపాకీ ఏల… మాటలుండగా..

ఆనం అన్నయా…  Advertisement ఏంటన్నయ్యా… నువ్వు మాట్లాడితేనే తూటాలు పేల్చినట్టుంటుంది. మరి నీలాటోడికి తుపాకీ ఎందుకన్నయ్యా… మాటల్తో ఎట్టాంటోళ్లనైనా ఓ ఆటాడేస్కుంటావ్‌ గదా. ఇక నీకు తుపాకీ ఎందుకు? కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల…

ఆనం అన్నయా… 

ఏంటన్నయ్యా… నువ్వు మాట్లాడితేనే తూటాలు పేల్చినట్టుంటుంది. మరి నీలాటోడికి తుపాకీ ఎందుకన్నయ్యా… మాటల్తో ఎట్టాంటోళ్లనైనా ఓ ఆటాడేస్కుంటావ్‌ గదా. ఇక నీకు తుపాకీ ఎందుకు? కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌ సింగ్‌ను విపరీతంగా తిట్టడంలో నీ ప్రత్యేకతే వేరు. డిగ్గీ రాజా అంటూ అందరూ ముద్దుగా చెప్పుకునే దిగ్విజయ్‌ని ‘డిగ్గీ రాజా కాదు… బ్లడీ రాజా’ అంటూ విమర్శనా తూటాలు పేల్చావు. 

గతంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా డిగ్గీ రాజా పనిచేసిన కాలంలో కాంగ్రెస్‌ పార్టీ అక్కడ నాశనం అయిపోయిందంటూ నువ్వు తెగ విమర్శించావా. అలా చక్కగా తూటాల్లాంటి మాటలతో ఎదుటివారిపై దాడికి ప్పాలడగలిగే నువ్వు చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుడేల అన్నయ్యా…? ఎవరైనా చూస్తే బాగోదేమో. అయినా నువ్వు దాన్నేమైనా దాచేలా ఉంచావా… చక్కగా ఒక పేపర్‌లో పట్టుకుని కలయదిరుగుతూ ఉన్నావు. నీ ఇంటి ముందు ఐరన్‌ ఫెన్సింగును ఏర్పాటు చేశారని పోలీసులపై కేకలేశావా… నీ కేకలకే అదిరి పోలీసులు ఆఘమేఘాలమీద కంచెను తొలగించే ఏర్పాట్లు చేశారు. అయితే ఇంత ధైర్యంగా తిరిగే నువ్వు ఎందుకు తుపాకీ పెట్టుకుని తిరుగుతున్నావో అర్ధం కావడంలేదు… 

ఆ… చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు అర్ధమైంది. వైకాపాకు చెందిన సమైక్యాంధ్ర ఉద్యమకారులు నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పారుకదా… కాంగ్రెసోళ్ల ఇళ్లను కూడా ముట్టడిస్తామని వైకాపా నాయకులు పిలుపునిచ్చారుకదా… వారికి భయపడి నువ్వు చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నావా…? ఇదేంటన్నయ్యా… అది నీ ఏరియా. నీ ఏరియాలో నువ్వు భయపడేది ఏంటి. చక్కగా ధైర్యంగా స్వేచ్ఛగా తిరగాల్సింది చేతిలో తుపాకీ ఏంటన్నయ్యా…? అయినా నువ్వు మంత్రి గారి సోదరుడివి కాబట్టి నిన్ను చూసినా కూడా పోలీసులు ఏమనకుండా మిన్నకుండిపోయారు. పైగా నీ అరుపులకు హడలిపోయారుకూడా…! అదే వేరేవాళ్లయితే సీను వేరేగా ఉండేది. మొత్తానికి సమైక్య ఉద్యమం పుణ్యమా అని నీ స్వస్థానంలో స్వేచ్ఛగా తిరిగే ధైర్యం కూడా నీకు లేకుండాపోయిందికదా అన్నయ్యా…!! జై బోలో తుపాకీ కీ.. జై!!