ఫన్‌చర్‌ : సెంద్రన్నా… నువ్‌ ఇటలీకి ఎల్లాల్సిందే..

సెందరబాబన్నా…  Advertisement నువ్వు బలేటోడివన్నా… ఎంత తెలివైనోడివని. నాకుగాదుగానీ… మా నాయనకు బాగాదెలుసు. నువ్వు ఎట్టాటోడివో ఆయన నాకుజెపతావుండేటోడు. రాజకీయాల్లో నిన్ను మించినోళ్లు లేరంటగదా… మనపక్క… ఇప్పుడుగూడా ఒకపక్క అందురూ మన రాష్ట్రాన్ని ముక్కలుజెయ్యబాకండి…

సెందరబాబన్నా… 

నువ్వు బలేటోడివన్నా… ఎంత తెలివైనోడివని. నాకుగాదుగానీ… మా నాయనకు బాగాదెలుసు. నువ్వు ఎట్టాటోడివో ఆయన నాకుజెపతావుండేటోడు. రాజకీయాల్లో నిన్ను మించినోళ్లు లేరంటగదా… మనపక్క… ఇప్పుడుగూడా ఒకపక్క అందురూ మన రాష్ట్రాన్ని ముక్కలుజెయ్యబాకండి అంటా గట్టిగా పోరాడతావుండారా… నువ్వు మాత్తరం నీ పెసాల్టీ ఏటో జూపిస్తావుండావు. ముక్కలైనా పరవాలేదు… పెజలకు మాత్తరం అన్నాయం జెయ్యబాకండి అంటావుండావు. అందుకే నువ్వు పెసలన్నా…!

ఇంకో ఇసయవేందంటే… ఇక్కడ అంటే మన రాస్ట్రంలో జగన్‌గూడా దీచ్చ జేస్తావుండాడా… నువ్వు ఈడజేసేది ఏందని డిల్లీకిబొయినావ్‌. అప్పుడుగూడా నువ్వు పెసల్‌. ఈడ జగన్‌ రాష్ట్రాన్ని ముక్కలుజెయ్యబాకండి అంటా అన్నందినకుండా గూకుంటే… అక్కడ నువ్వుమాత్తరం ముక్కలుజేసేముందు ఎవురికి ఏమిస్తారంటా గూసున్నావు… నాయకులకుగాదులే… పెజలకు.

ఏ పక్క పెజలకు ఎట్టా జేస్తారని అడగతావుండావు. అందుకే నువ్వు పెసల్‌ అంటా… ఇంకోటేవంటే… నిన్న నువ్వు బలే మాట్లాడినావంటగదా… మా అబ్బయ్యజెప్పినాడు… నువ్వు అదేదో బాస… ఆ… ఇటలీ అంట. ఆ బాసలో మాట్లాడేసినావంటగదా… ఎంతైనా నువ్వ బలే తెలివైనోడివన్నా. అందుకే నేనేదో పల్లెటూరోణ్నని అనుకోకుండా ఒకమాట జెపతా ఇనుకో… ఏవంటే నువ్వు నేరుగా ఇటలీ దేశానికి ఎల్లిపో. అక్కడ నువ్వు రాజకీయాల్లోకి దిగేసెయ్‌. 
ఎందుకంటే ఇక్కడ మనదేశంలో ఇటలీ దేశపు ఆడబడుసు అంతా నడిపిస్తావుండాదని నువ్వు జెప్పినావుగదా…

నువ్వుగూడా ఆడికెల్లిపో. అక్కడ నువ్వు ఎన్నికల్లో దిగేసి, నిలబడేసి, గెలిసెయ్‌. ఆనక అక్కడ సెక్రందిప్పు. ఆడదిప్పితే ఈడ దిరగాలా… అట్టాదిప్పాల. అప్పుడు ఈడ రాజకీయాలు నువ్వుజెప్పినట్టే నడస్తాయి. ఎందుకంటే నువ్వు ఆడదిప్పతావుగదా… నువ్వుగనక అట్టాజేసినావంటే… మేమందరం అంటే తెలుగోళ్లవంతా నీపేరుజెప్పుకుని శానా గర్వపడతాం. ఏటన్నా… అరదవైందా… నువ్వు ఇటలీకి ఎల్లాల… సెక్రం దిప్పాల. ఈడ దిరగాలా… ఉంటానన్నా…!

‘ఇమ్ము బలిజుమో’ ఏమీ కదలడం లేదు..తల్లోయ్‌ అంటూ  సోనియమ్మ కు మాత్తరమే అర్దమయ్యే ఇటలీ బాసలో నువ్వు ఎకసెక్కం జేసావంట గద. ఆపాటి ఇటలీ నేరిసిన తరవాత.. ఇక ఇటలీ ఎన్నికల్లో అడుగెట్టి దున్ని పారెయ్యకుండా.. ఇంకా వెరపేటికి సెంద్రబాబా.. లగెత్తు…!!