శ్రీరామరాజ్యం సినిమాను బాపు దర్శకత్వంలో నందమూరి బాలయ్య తో నిర్మించిన వెంటనే యలమంచిలి సాయిబాబుకు అభిరుచిగల చిత్రాల నిర్మాతగా అనల్పమైన ప్రఖ్యాతి దక్కింది. దాంతో ఆయన చాలా మురిసిపోయారు. పన్లో పనిగా.. తన కొడుకు రేవంత్‌ను తిరుగులేని లవర్‌బోయ్ ఇమేజితో తెలుగుతెరపై హీరోగా నిలబెట్టాలని ఆయన కలగన్నాడు. ఇప్పుడంటే పూరీ జగన్నాధ్ గానీ.. ఒకప్పట్లో కొత్త హీరోలను తెరకు ఇంట్రడ్యూస్ చేయడం అంటే.. గోల్డెన్ హ్యాండ్‌గా పేరున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఇంటింటా అన్నమయ్య’ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమా పూర్తయి కొన్ని నెలలు గడచిపోయాయి. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించి.. దెబ్బతిన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైనదంటే.. సినిమాను అతి కష్టమ్మీద విడుదల చేసినా కూడా నిర్మాతకు ఒక రూపాయి మిగిలే అవకాశం కనిపించడం లేదుట. కనీసం టెక్నీషియన్లకు బాకీపడిన రెమ్యూనరేషన్లు చెల్లించడానికి కూడా సినిమా అమ్మితే డబ్బు రాకపోవచ్చునని అనుకుంటున్నారట.
ఫైనాన్షియర్లకు ఇవ్వవలసిన మొత్తాలు ఒక భారంగా తయారైతే.. ఇప్పటిదాకా సినిమాకు దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావుకు గానీ, సంగీతం సమకూర్చిన కీరవాణికి గానీ.. నిర్మాత యలమంచిలి సాయిబాబు ఒక్కపైసా రెమ్యూనరేషన్లు ఇంకా చెల్లించలేదని ఫిలింనగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సినిమాను నిర్మాత చెబుతున్న రేట్లకు కొనడానికి బయ్యర్లు ముందుకురావడం లేదని, బయ్యర్లు ఆఫర్ చేస్తున్న రేటుకు ఇచ్చేస్తే సినిమా టెక్నీషియన్ల రెమ్యూనరేషనన్లు కూడా రావని.. ఇక ఆ సినిమాను విడుదల చేయడం కంటె ఫస్ట్ కాపీని ఇంట్లో దాచుకోవడమే ఉత్తమం అని నిర్మాత భావిస్తున్నట్లుగా సినీజనం అనుకుంటున్నారు.