ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్ లిస్ట్‌లో ఇప్పుడు రెండు, మూడు స్థానాల్లో ఉన్న సినిమాలు పవన్‌కళ్యాణ్‌వే. గత ఏడాది ‘గబ్బర్‌సింగ్’తో అప్పటివరకు రెండవ స్థానంలో ఉన్న ‘దూకుడు’ని దాటిన పవన్‌కళ్యాణ్ ఈసారి మూడవ స్థానంలో ఉన్న ‘దూకుడు’ని ‘అత్తారింటికి దారేది’తో దాటాడు. యాభై ఆరు కోట్ల వరల్డ్ వైడ్ షేర్‌తో మూడోస్థానంలో ఉన్న దూకుడుని ‘అత్తారింటికి దారేది’ పన్నెండో రోజునే అధిగమించింది.
అరవై రెండు కోట్ల షేర్‌తో రెండవ స్థానంలో ఉన్న ‘గబ్బర్‌సింగ్’ని కూడా ఈ చిత్రం త్వరలోనే అధిగమిస్తుందని ట్రేడ్ రిపోర్ట్. వచ్చే వారం దసరా పండుగ కాబట్టి మూడవ వారం వసూళ్లు కూడా ఈ చిత్రానికి బాగుంటాయని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. నైజాంలో సూపర్‌స్ట్రాంగ్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం కలెక్షన్లపై రెండవ వారంలో సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ, మరియు విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం పడిరది.
విడుదలకి ముందు నుంచీ ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా కానీ ‘అత్తారింటికి దారేది’ వాటన్నిటినీ తట్టుకుని నిలబడి ఆల్‌టైమ్ టాప్ హిట్స్‌లో చోటు దక్కించుకుంది. ఒకవేళ ఈ చిత్రం ఎలాంటి గందరగోళం లేకుండా, ప్రశాంత వాతావరణంలో రిలీజ్ అయినట్టయితే ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేసి ఉండేదో మరి?