జనసేనాని పవన్‌కల్యాణ్ పాలిట అప్రకటిత ప్రత్యర్థి అయ్యాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ. జనసేనకు రాజకీయ ప్రత్యర్థుల కంటే, వర్మ రూపంలో అతిపెద్ద శత్రువు కాచుక్కూచుని ఉన్నారు. ఎప్పటికప్పుడు పవన్ రాజకీయ పంథాపై ట్విటర్ వేదికగా చీవాట్లు పెడుతున్నారు.
తాజాగా ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో పాల్గొనేందుకు పవన్‌కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అలాగే చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ రాజకీయంగా సన్నిహితంగా మెలగడాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్‌కల్యాణ్ ట్విటర్లో ఓ వీడియో పెట్టారు. దీనికి కనీసం క్యాప్షన్ కూడా పెట్టలేదు. పవన్ ఆవేశపూరిత ప్రసంగాన్ని వినిపించారు. ఇందులోనే చంద్రబాబుతో నవ్వుతూ, తుళ్లుతూ పవన్ గడపడాన్ని కూడా కలగలిపి చూపించారు.
చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని పవన్ ఎంతో మర్యాదగా ఉండడాన్ని చూడొచ్చు. బాబు ముద్దుముద్దుగా నవ్వుతూ మాట్లాడుతుంటే, పవన్‌కల్యాణ్ పడిపడి శ్రుతి కలపడాన్ని వీక్షించొచ్చు. పవన్ ఆవేశ పూరిత ప్రసంగంలో ఏమన్నారంటే…
“అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీలను చితక్కొడుతుంటే ఈ రోజు వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకుని తిరుగుతున్నారు చంద్రబాబునాయుడు గారు. ఆయన గురించి ఏం మాట్లాడ్తాం? పౌరుషం లేదా మీకు? ఆత్మగౌరవం లేదా? సిగ్గులేదా? శరం లేదా? అంటూ పవన్ తన సహజ ధోరణిలో ఊగుతూ మాట్లాడ్డాన్ని చూడొచ్చు. ఇదే వీడియోలో కొన్ని నెలల తర్వాత అంటూ బాబుతో అంటకాగే దృశ్యాలు ప్రత్యక్షమవుతాయి. ఎవడేమి అంటే మనకేమిటన్నా అనే వినిపించడం ద్వారా…తానేం చెప్పదలుచుకున్నారో వర్మ ఎలాంటి కామెంట్స్ లేకుండానే, పవన్ కల్యాణ్ మాటల్లోనే అంతా చేసేశారు. పవన్‌ను ఓ రేంజ్లో ర్యాగింగ్ చేశారనే చర్చకు తెరలేచింది.