టాలీవుడ్ లో పాథ్ బ్రేకింగ్ మూవీగా నిలిచిన అర్జున్ రెడ్డి, త్వరలోనే బాలీవుడ్ లో రీమేక్ కానుంది. మొన్నటివరకు ఈ రీమేక్ లో వరుణ్ ధావన్ నటిస్తాడంటూ వార్తలు వచ్చాయి. కానీ అర్జున్ రెడ్డిగా అర్జున్ కపూర్ నటించబోతున్నాడు. ఈ మేరకు ప్రాధమిక దశ చర్చలు పూర్తయ్యాయి.
ఈ రీమేక్ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి అర్జున్ కపూర్ రెమ్యూనరేషన్. కథ బాగా నచ్చడంతో పారితోషికం తీసుకోకుండా (స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా) రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు అర్జున్ కపూర్. గతంలో “కీ & కా” అనే సినిమా కూడా ఇలానే పనిచేశాడు.
మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డిని డైరక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ, ఈ బాలీవుడ్ ప్రాజెక్టును కూడా డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రీమేక్ రైట్స్ దక్కించుకున్న మురద్ ఖేతానీ, ప్రస్తుతం ఇదే చర్చల్లో బిజీగా ఉన్నాడు.
ఫిబ్రవరిలో సినిమాకు సంబంధించి ఫైనల్ సిట్టింగ్ లో హీరో, ప్రొడ్యూసర్, దర్శకుడు కూర్చుంటారు. జూన్ లేదా జులై నుంచి సినిమా సెట్స్ పైకి వస్తుంది. తెలుగులో సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్న అర్జున్ రెడ్డికి బాలీవుడ్ లో ఆ సమస్య పెద్దగా ఎదురుకాకపోవచ్చు. హీరో పేరు కూడా సింక్ అయింది కాబట్టి, హిందీలో ఈ రీమేక్ సబ్జెక్ట్ కు అర్జున్ కపూర్ అనే టైటిల్ పెడతారేమో.