ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి ఎక్సర్ సైజ్ లపై వున్నారు. మరో పది హేను రోజుల్లో ఆ వర్క్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్…

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి ఎక్సర్ సైజ్ లపై వున్నారు. మరో పది హేను రోజుల్లో ఆ వర్క్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను త్రివిక్రమ్ ఎప్పుడో పూర్తి చేసారు.

అందువల్ల ఇక ఇప్పుడు షెడ్యూళ్లు ఇతరత్రా వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ఫిబ్రవరి 14తరువాత మంచి మహుర్తం కోసం చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అది ఫైనల్ అవుతుంది.

కాగానే మిగిలిన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. ఇప్పటికే సాంకేతిక వర్గం అంతా దాదాపు ఫైనల్ అయిపోయింది. నిర్మాణ సంస్థ హారిక హాసినికి బయ్యర్లతో సమస్య లేదు. ఎందుకంటే దాదాపు ఫిక్స్ డ్ బయ్యర్లు. వాళ్లంతా మొదటి నుంచీ అదే సంస్థతో ప్రయాణిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాతవాసి వల్ల తేడా వచ్చినా, నిర్మాత చినబాబు ఏదో ఒకటి చేస్తారు అనే నమ్మకం వున్నవారు. ఇక ఫైనాన్షియల్ గా కూడా సంస్థకు సమస్యలేమీ లేవు. అందువల్ల త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాకు అడ్డంకులు ఏవీ లేదు.

పైగా ఇప్పుడు త్రివిక్రమ్ దెబ్బతిన్న పులి. కచ్చితంగా తనేంటో ఓసారి చూపించేందుకు రెడీ అవుతారు. విమర్శలకు తన వర్క్ తోనే సమాధానం చెప్పాలని కచ్చితంగా అనుకుంటారు. త్రివిక్రమ్ ప్లస్ ఏమిటంటే, ఆయనకు ఘోస్ట్ లు లేరు.

టీమ్ లు లేవు. స్క్రిప్ట్ అంతా ఆయనే చేసుకుంటారు. అందువల్ల ఓ ఘోస్ట్ జారిపోయి ఫ్లాప్ వచ్చింది. మరో ఘోస్ట్ దొరకాలి అన్న సమస్య లేదు. ఎటొచ్చీ మరీ మేధావితనం, క్లాసికల్ స్టయిల్ నేపథ్య సంగీతాలు వంటి వాటి జోలికి పోకుండా, కామన్ ఆడియన్ ను దృష్టిలో వుంచుకుంటే చాలు. ఆయన తన లోని రైటింగ్ పవర్ ను మరోసారి చూపించే అవకాశం వుంది.