‘గ్యాంగ్’ వార్ సీరియస్ నే

భాగమతి సినిమాను తమిళనాట వాళ్లు, గ్యాంగ్ సినిమాను తెలుగునాట వీళ్లు విడుదల చేస్తున్నారు తప్ప, సంక్రాంతి రేస్ లో గ్యాంగ్ విడుదలలో సీరియస్ నెస్ లేదు అన్న వార్తలు వినిపించాయి నిన్న మొన్నటి వరకు.…

భాగమతి సినిమాను తమిళనాట వాళ్లు, గ్యాంగ్ సినిమాను తెలుగునాట వీళ్లు విడుదల చేస్తున్నారు తప్ప, సంక్రాంతి రేస్ లో గ్యాంగ్ విడుదలలో సీరియస్ నెస్ లేదు అన్న వార్తలు వినిపించాయి నిన్న మొన్నటి వరకు. అయితే యువి క్రియేషన్స్ సంస్థ గ్యాంగ్ ను సీరియస్ గా తీసుకోవడం ప్రారంభించింది. మధ్యలో టెర్మ్స్ ఏం మారాయో, లేదా సూర్య, జ్ఞానవేల్ రాజా ఏమన్నారో తెలియదు కానీ, యువి క్రియేషన్స్ సంస్ధ స్ట్రాటజీ మార్చింది. వాస్తవానికి గ్యాంగ్ సినిమాను యువి తెలుగునాట విడుదల మాత్రమే చేస్తోంది.

ఒక పక్క అజ్ఞాతవాసి, మరోపక్క జై సింహా సినిమాలు వుండగా సూర్య నటించిన గ్యాంగ్ సినిమా విడుదలవుతుంటే, జనం దృష్టి పెద్దగా అటువెళ్లలేదు. టీజర్ విడుదల వరకు కూడా గ్యాంగ్ సినిమాను పోటీగా అనుకోలేదు. అయితే ఇప్పుడు స్ట్రాటజీ మార్చి, కాస్త గట్టిగా పబ్లిసిటీ స్టార్ట్ చేసారు. సూర్యను తీసుకువచ్చి రెండు రోజుల పాటు ఇక్కడే వుంచారు. కాస్త గట్టిగానే ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. దాన్ని లైవ్ కాస్ట్ కూడా చేసారు.

అంతటితో ఆగకుండా సూర్యతో మీడియా మీట్ లు, ఇంటర్వూలు వగైరా కార్యక్రమాలు స్టార్ట్ చేసారు. అంతటితో ఆగకుండా థియేటర్ల సంఖ్య కూడా కాస్త గట్టిగానే వుండేలా అగ్రిమెంట్లు స్టార్ట్ చేసారట. ఇదే సంస్థ నిర్మించిన భాగమతి సినిమా మూడోవారంలో విడుదల కాబోతోంది. అంటే ఒక వారం ముందుగా గ్యాంగ్ వస్తుంది. అందువల్ల ఎక్కువ థియేటర్లు గ్యాంగ్ కోసం వేసినా, సమస్య లేదు. వన్ వీక్ తరువాత పరిస్థితి చూసి భాగమతికి కంటిన్యూ చేసుకోవచ్చు. పైగా పండగ టైమ్ లో ఎక్కువ థియేటర్లు వుండడం అన్నది కాస్త అడ్వాంటేజ్ అవుతుంది.

అయితే అన్ని పాకెట్స్ లో థియేటర్లు దొరకడం కాస్త కష్టమే. యువి, గీతా థియేటర్ల వరకు ఓకె. దిల్ రాజుకు అజ్ఞాతవాసి వ్యవహారం వుంది. అది చూసుకుని థియేటర్లు ఇవ్వాలి. సురేష్ బాబుకు రంగులరాట్నం ఆబ్లిగేషన్ వుంటుంది. రంగుల రాట్నం కోసం రెండు వందల నుంచి 250థియేటర్లు కావాలని చూస్తున్నారు అన్నపూర్ణ జనాలు. అందుకే వీలయినన్ని థియేటర్ల కోసం ఇప్పుడు యువి జనాలు కసరత్తు స్టార్ట్ చేసారు. కనీసం మూడు వందలకు పైగా థియేటర్లలో గ్యాంగ్ ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికి 250కి పైగా థియేటర్లు ఐడెంటిఫై అయినట్లు తెలుస్తోంది.

ఇక్కడితో ఆగకుండా పండగ టైమ్ నాటికి కాస్త భారీగా పబ్లిసిటీ చేయాలన్నది యువి ఆలోచన. ఇదంతా రెండు రోజుల కిందటి నుంచి వచ్చిన మార్పు. మరి జ్ఞాన్ వేల్ రాజా, సూర్య వచ్చిన తరువాత వచ్చిన పరిణామం ఇది కావచ్చు. మొత్తం మీద సంక్రాంతి పోరు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.