దర్శకుడు త్రివిక్రమ్ కు సెంటిమెంట్లు ఎక్కువ. ముహూర్త, జ్యోతిష్య శాస్త్రాలపై కూడా నమ్మకం ఎక్కువ. ఎప్పుడో తను స్టార్టింగ్ స్టేజ్ లో వున్న రూమ్ ను ఇప్పటికీ నెలకు 12వేలు అద్దె ఇస్తూ అలా వుంచుకున్నాడు. అప్పుడప్పుడు వెళ్లి కాస్సేపు గడిపి వస్తాడు. అలాంటి త్రివిక్రమ్ కు ఇంకో నమ్మకం కూడా వుందట.
అదేంటంటే, తనవల్ల ఎవరికైనా నష్టం వచ్చిందని తెలిస్తే, వెంటనే భర్తీ చేసేస్తాడట. ఎందుకంటే అలా భర్తీ చేయకపోతే, తాను మరింత నష్టపోతానని నమ్మకం ఎక్కువంట.
అయితే ఇప్పుడీ సెంటిమెంట్ వ్యవహారం ఎందుకు వచ్చిందీ అంటే… అజ్ఞాతవాసి కథ విషయమై టీ సిరీస్ తొ రాజీ కుదిరింది. ఆ రాజీ వ్యవహారం మీద రకరకాల కథనాలు వున్నాయి. హిందీ శాటిలైట్, డిజిటల్, రీమేక్ హక్కులు హోల్డ్ చేసారని, లేదు, పదికోట్లు అని, కాదు రెండున్నర వైట్, మిగిలింది బ్లాక్ అని ఇలా రకరకాల కథనాలు వున్నాయి.
నిజానికి త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ తో పర్మనెంట్ అసోసియేషన్ వున్నందున, పైగా చిన్నబాబు లాంటి ప్రొడ్యూసర్ కావడంతో ఎలాంటి చికాకులు వుండవు. త్రివిక్రమ్ ను పైసా ఇమ్మని అడగరు. కానీ త్రివిక్రమ్ కు వున్న సెంటి మెంట్ ప్రకారం ఎంతయితే అంతా వెనక్కు ఇచ్చేస్తారని, ఆయన సెంటిమెంట్ ను, ఆయన నైజం తెలిసిన వారు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.