అజ్ఞాతవాసి టార్గెట్‌ 125 కోట్లు!

'బాహుబలి 2' తర్వాత ఆ రేంజ్‌లో ప్రీ రిలీజ్‌ జరిగిన సినిమా అజ్ఞాతవాసి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తొంభై కోట్లకి పైగా బయ్యర్లు చెల్లించారు. మొత్తంగా థియేట్రికల్‌ రైట్స్‌ నూట ఇరవై కోట్లు పైనే…

'బాహుబలి 2' తర్వాత ఆ రేంజ్‌లో ప్రీ రిలీజ్‌ జరిగిన సినిమా అజ్ఞాతవాసి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తొంభై కోట్లకి పైగా బయ్యర్లు చెల్లించారు. మొత్తంగా థియేట్రికల్‌ రైట్స్‌ నూట ఇరవై కోట్లు పైనే పలికాయి. అంటే ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ అయి హిట్‌ అనిపించుకోవాలంటే రమారమి 125కోట్ల షేర్‌ రావాలట.

బాహుబలి సినిమాలకి తప్ప అంత వసూలు చేసిన సినిమానే లేదింతవరకు. అంత పెద్ద హిట్‌ అయిన ఖైదీ నంబర్‌ 150కి కూడా నూటఅయిదుకోట్ల లోపే వసూళ్లు వచ్చాయి. ఈ లెక్కన అజ్ఞాతవాసి ఎంతటి హిట్‌ అవ్వాలో చూసుకోండిక. ఈ సినిమాపై బజ్‌ తారా స్థాయిలో వుంది. టాక్‌తో సంబంధం లేకుండా తొలి వారంలో ఎనభై కోట్ల షేర్‌ రాబట్టే సత్తా వున్న సినిమానే ఇది.

అయితే ఆ పైన బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌కి చేరాలంటే హిట్‌ టాక్‌ కంపల్సరీ. వంద కోట్ల షేర్‌ వచ్చినా కానీ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్‌ అయిపోతుంది. అన్ని ఏరియాల్లోను నాన్‌ బాహుబలి రికార్డులు సృష్టిస్తే తప్ప ఈ చిత్రం హిట్‌ అనిపించుకోలేదు. పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌పై వున్న నమ్మకంతో బయ్యర్లు దీనిపై ఎలాంటి భయం లేకుండా పెట్టుబడి పెట్టేసారు.

అయితే ఆ నమ్మకానికి తగ్గట్టు వసూళ్లు రాబట్టే సత్తా సినిమాలో వుందా లేదా అనేది జనవరి 10న తెలుస్తుంది.