ట్రయిలర్ కోసం వెయిటింగ్ ఇక్కడ

మొత్తానికి అజ్ఞాతవాసి ట్రయిలర్ బయటకు వస్తోంది. ఎప్పుడో కట్ చేసారు, త్రివిక్రమ్ దాచేసుకున్నాడు అంటూ ఎవరి ఊహాగానాలు వారు చేసారు. అది కాదు, సెన్సారు కావాలి, సిజి వర్క్ కావాలి అని చెప్పకనే చెబుతూ…

మొత్తానికి అజ్ఞాతవాసి ట్రయిలర్ బయటకు వస్తోంది. ఎప్పుడో కట్ చేసారు, త్రివిక్రమ్ దాచేసుకున్నాడు అంటూ ఎవరి ఊహాగానాలు వారు చేసారు. అది కాదు, సెన్సారు కావాలి, సిజి వర్క్ కావాలి అని చెప్పకనే చెబుతూ వచ్చాం. ఆఖరికి అదే నిజమైంది. రఫ్ కాపీ సెన్సారు అయిపోయింది.

ఇప్పుడు ముంబాయి నుంచి సిజి వర్క్ తో ట్రయిలర్ ఏ క్షణం అయినా వస్తుంది. దానికోసం హారిక హాసిని యూనిట్ జనాలు వెయిట్ చేస్తున్నారు. అది వచ్చిన మరుక్షణం ఆన్ లైన్ లోకి వదిలేస్తారు. ముహుర్తాల లెక్కలు చూసే యూనిట్ కాబట్టి, బహుశా ఏడున్నర తరువాత వదుల్తారని ఫీలర్ వినిపిస్తోంది.

ఇదిలా వుంటే ఇప్పటి దాకా అజ్ఞాతవాసి ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ కాలేదు. ఈ నెల 8నుంచి అందుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు ముందుగా మీడియా ముందుకు వచ్చే అవకాశం వుంది. పవన్, త్రివిక్రమ్, నిర్మాత చినబాబు మీడియా ముందుకు వస్తారా? లేక విడుదల తరువాత వస్తారా? అన్నది క్లారిటీ లేదు. అయితే పవన్ కొన్ని టీవీ ఇంటర్వూలు ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

ట్రయిలర్ మీద అజ్ఞాతవాసి బజ్ కచ్చితంగా ఆధారపడి వుంది. ట్రయిలర్ ఏమాత్రం సూపర్ గా వున్నా, బజ్ అమాంతం పెరిగిపోవడం గ్యారంటీ. అదే టీజర్ మాదిరిగా అత్తారింటికి దారేది 2లా వుంటే మాత్రం జనం కాస్త నీరసపడతారు.