బాలయ్య.. తేజ.. ఏది నిజం?

ఎన్టీఆర్ బయోపిక్ ఇంకా ప్రారంభం కాలేదు. మార్చి నుంచి ప్రారంభమవుతుంది. అంతవరకు ఒకె. కానీ బయోపిక్ అన్నాక ఎన్టీఆర్ చిన్న తనం నుంచి మరణించేవరకు వుంటుంది. వుండాలి. అలా వుంటే, అందులో లక్ష్మీపార్వతి పాత్ర..…

ఎన్టీఆర్ బయోపిక్ ఇంకా ప్రారంభం కాలేదు. మార్చి నుంచి ప్రారంభమవుతుంది. అంతవరకు ఒకె. కానీ బయోపిక్ అన్నాక ఎన్టీఆర్ చిన్న తనం నుంచి మరణించేవరకు వుంటుంది. వుండాలి. అలా వుంటే, అందులో లక్ష్మీపార్వతి పాత్ర.. ఎన్టీఆర్ రెండో పెళ్లి వుండాల్సిందే. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ భార్యగా ప్రజల ముందు అంగీకరించాల్సిందే. పనిలోపనిగా వైస్రాయ్ హఢావుడి, ప్రజల్లోకి ఎన్టీఆర్ వెళ్లి చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు అన్నీ వుండాల్సిందే.

దర్శకుడు తేజ సన్నిహితులకు చెప్పారు అని తెలుస్తున్న దాని ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ ఆయన పార్టీపెట్టి, తొమ్మిదినెలలు ప్రచారం చేసి, కాంగ్రెస్ ను ఓడించి, అధికారం చేపట్టడంతో ముగుస్తుంది. ఆ తొమ్మిది నెలల ప్రచారం, హడావుడి, అదే సినిమా క్లయిమాక్స్.

కానీ బాలయ్య వేరుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. చనిపోయేదాకా సినిమా వుంటుందని బాలయ్య ఇంటర్వూల్లో చెబుతున్నారట. అలా అయితే మరి లక్ష్మీపార్వతి, బాబు వెన్నుపోటు, ఆపై ప్రజల్లో నల్ల దుస్తులతో ఎన్టీఆర్ ప్రచారం, ఇవన్నీ వుంచుతారా? స్కిప్ చేస్తారా? అన్నది అనుమానం.

అసలు ఎవరి స్క్రిప్ట్ అయినా కూడా చంద్రబాబు అనుమతి లేకుండా, ఆయన దృష్టికి తేకుండా సినిమా వుంటుందా? అన్నది అసలు సిసలు అనుమానం. చూడాలి బయోపిక్ ప్రారంభమై, నిర్మాణమై, జనాల ముందుకు వచ్చినపుడు. ఎలా వుంటుందో?