టచ్ చేసి చూడు. మాస్ మహరాజా రవితేజ లేటెస్ట్ మూవీ. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఇది వస్తే తాము వెనక్కు వుందామనుకున్న రాజ్ తరుణ్ రంగులరాట్నం ముందుకు వచ్చింది. టచ్ చేసి చూడు సినిమా 25లేదా 26కు షెడ్యూలు చేసారు.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సంగతి ఏమిటంటే, ఈ డేట్ నుంచి మరో వారం వెనక్కు జరిపే ఆలోచనలో వున్నారని. ఫిబ్రవరి రెండు డేట్ ప్రస్తుతానికి కాస్త ఫ్రీగా వుంది. ఆ రోజున నాగశౌర్య ఛలో తప్ప మరో సినిమా లేదు.
కానీ ముందు వారమైన 26న భాగమతి, అభిమన్యుడు, రాజరథం, ఆచారి అమెరికా యాత్ర సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. అప్పటికే అజ్ఞాతవాసి థియేటర్లలో వుంటుంది. ఇక బాలయ్య జై సింహా, రాజ్ తరుణ్ రంగుల రాట్నం కూడా కొన్ని థియేటర్లలో అయినా వుంటాయి. మూడు సినిమాలు వుండగా మరో అయిదు సినిమాలకు థియేటర్లు అంటే కాస్త కష్టమే.
అందుకే టచ్ చేసి చూడు సినిమాను ఓ వారం వెనక్కు జరపాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీజర్ బయటకు వస్తే క్లారిటీ వస్తుందేమో? చూడాలి.