అది విశాల్ ‘నా పేరు సూర్య’ నా?

ఇవ్వాళ రేపు భలే ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడో కొరియన్, లేదా ఫ్రెంచ్ సినిమా చూసి చిన్న అయిడియా వస్తుంది. దాన్ని ఎవరికి వారు వాళ్ల వాళ్ల స్టయిల్ లో డెవలప్ చేసుకుంటారు. తీరా చూసి…

ఇవ్వాళ రేపు భలే ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడో కొరియన్, లేదా ఫ్రెంచ్ సినిమా చూసి చిన్న అయిడియా వస్తుంది. దాన్ని ఎవరికి వారు వాళ్ల వాళ్ల స్టయిల్ లో డెవలప్ చేసుకుంటారు. తీరా చూసి సినిమాలు బయటకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. లార్గో వించ్ వ్యవహారం తెలిసిందే. ఈ సినిమా పాయింట్ తోనే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అటు మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలు రూపు దిద్దుకుంటున్నాయన్న గుసగుసలు వున్నాయి.

మరోపక్క ఇప్పుడు అలాంటి వ్వవహారమే మరొకటి వినిపిస్తోంది. నాపేరు సూర్యలో లైన్, అభిమన్యుడులో లైన్ ఒకటే అన్నది ఆ గుసగుస. ఎలాగ అంటే, నా పేరు సూర్యలో హీరో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు. మిలట్రీ నుంచి బయటకు పంపించి ఓ సైక్రియాటిస్ట్ దగ్గర సర్టిఫికెట్ తెచ్చుకోమంటారు. ఆ సైక్రియాటిస్ట్ కు హీరో చాలా దగ్గర సంబందం వుంటుంది.

ఇక అభిమన్యుడులో కూడా హీరోను ఇలాగే ఏంగర్ మేనేజ్ మెంట్ కారణంతో డాక్టర్ దగ్గరకు పంపిస్తారు. ఆ డాక్టర్ ఎవరో కాదు. హీరోయిన్ సమంత.

సరే తరువాత లోకల్ ఏ సమస్యలపై ఆయా సినిమాల్లో హీరోలు పోరాడారు అన్నది వేరు కావచ్చు. బేసిక్ పాయింట్ అయితే ఒకటే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అభిమన్యుడు విడుదలయితే ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. అది ఈ నెలలోనేవిడుదల.

ఇదిలా వుంటే నిజానికి ఈపాయింట్ మాత్రం కొత్తదంటారా? బొబ్బిలిపులిలో మిలట్రీ నుంచి సెలవుపై వచ్చిన హీరో స్థానిక అన్యాయాలపై పోరాడతాడు. తుపాకి సినిమాలో సెలవుపై మిలట్రీ నుంచి వచ్చిన హీరో, లోకల్ టెర్రరిజంపై పోరాడతాడు. దీనికి కొత్తగా ఏంగర్ మేనేజ్ మెంట్ అనేది ఒకటి వచ్చి చేరినట్లుంది.