1). ఆచార్య ఎట్లుంది? -గుడి పూజారి నక్సలైట్ యూనిఫాంలో మంత్రాలు చదివినట్లుంది
2). పెద్ద మనిషి ఆవేదన – ఇంట్లో వున్న సమస్యలకి తోడు ఇరుగుపొరుగు వచ్చి గిల్లుతున్నారు
3). మంత్రి రోజా కొత్త పథకం -ఉచిత చీరల పంపిణీ
4). హైదరాబాద్‌లో కరెంట్ లేదు – బొత్స -ఈ మధ్య పెళ్లి కూడా జనరేటర్తోనే చేసినట్టున్నారు
5). కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది -కేంద్ర మంత్రి మురళీధరన్ -ఏంటి సార్ అది … మళ్లీ చెప్పండి
6). టీ కొట్లు వ్యాఖ్య – సాక్షిలో ఎలాగూ ప్రభుత్వ వార్తలే రాస్తారు. మళ్లీ యాడ్స్ ఎందుకు. జనానికి డబ్బు బొక్క
7). మహానాడులో ఎన్టీఆర్ జీవిత విశేషాలు – చంద్రబాబు -వైస్రాయ్ హోటల్ ఫొటో ఎగ్జిబిషన్ కూడా పెట్టండి
8). సంస్కృతం రాజకీయ భాషగా వుంటే బావుంటుంది -కంగనా రనౌత్ -మా ఏపీ నాయకులు చాలా కాలంగా సంస్కృతమే మాట్లాడుతున్నారు
9). కరెంట్ సంక్షోభానికి కారణం మోదీనే – రాహుల్ -రాహుల్‌కి అప్పుడప్పుడు బల్బ్ వెలుగుతుంది
10). ఈ రోజు సామెత -మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు
-జీఆర్ మహర్షి