అల్లుఅర్జున్ నా పేరు సూర్య సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ మాంచి హల్ చల్ చేస్తోంది. జనాల్లో మాంచి బజ్ ను తీసుకువచ్చింది సినిమాకు. అయితే టీజర్ లో కేవలం హీరోను, హీరోయిన్ ను మాత్రమే చూపించారు. మిగిలిన కీలకపాత్రలు ఏవీ బయటకు రాలేదు. సినిమాలో సీనియర్ హీరో అర్జున్ కూడా కీలకపాత్ర ధరిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా కథ ప్రకారం హీరో తండ్రి పాత్ర కూడా చాలా కీలకం. అసలు సినిమా అంతా తండ్రీ కొడుకుల మధ్యే ఎక్కువగా వుంటుంది. ఇప్పుడు ఎక్స్ క్లూజివ్ గా తెలుస్తున్న సంగతి ఏమిటంటే, ఆ తండ్రి పాత్రను సీనియర్ అర్జున్ నే పోషిస్తున్నారని.
అంటే హీరో అల్లుఅర్జున్. తండ్రి పాత్ర సీనియర్ అర్జున్. ఇద్దరూ మాంచి పెర్ ఫార్మర్లే. తిరుగులేదు. అసలే కథ తండ్రీ కొడుకుల మధ్య బలమైన భావోద్వేగాలకు సంబంధించినది. ఇక ఇలాంటి నటులు చేయడం అంటే ఓ రేంజ్ లో వుంటుంది అనుకోవాలి. అన్నింటికన్నా చెప్పుకోవాల్సింది సీనియర్ అర్జున్ ఓ హీరోకి తండ్రిగా వేయడం ఇదే ఫస్ట్ యేమో?