ఆ హీరో అందంగా వుంటాడు. ఒడ్డు, పొడవు, రంగు, నవ్వు అన్నీ బాగుంటాయి. హీరోగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ టాలీవుడ్ లో ఒకడు.
ఇక ఆ హీరోయిన్ ది టాలీవుడ్ లోని మంచి ఫ్యామిలీల్లో ఒకటి. మాంచి టేస్ట్ వున్న అమ్మాయి. తన పనేదో తనది. తనపై వీళ్లతో పెళ్లి, వాళ్లతో పెళ్లి అన్నా సైలెంట్ గా వుంది. ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా ఇలాంటి గ్యాసిప్ లు ఏవీ పట్టించుకోకుండా వదిలేసారు.
అయితే బయటకు రాని, చాలా గుంభనంగా వున్న వ్యవహారం ఏమిటంటే, ఈ అమ్మాయి, ఆ అబ్బాయి చాలా మాంచి స్నేహితులు అని, అంతకు మించి మాంచి ప్రేమికులు అని. ప్రేమికులు అంటే ఈ తరం కుర్రాళ్లలా పబ్ ల వెంట, పార్టీల వెంట తిరగడం కాదు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ, పెద్దవాళ్లు పెళ్లి చేసేదాకా, సైలెంట్ అలా ప్రేమించుకుంటూ వుండడం. ఇప్పడు ఆ ఇద్దరూ అదే పని చేస్తున్నారట.
ఈ సంగతి ఆ ఇద్దరి కుటుంబాల్లో తెలుసు అని, వాళ్లకీ ఈ మ్యాచ్ ఇష్టమే అని తెలుస్తోంది. ఈ ఏడాది చివరకు ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే అంతా సజావుగా ముగిసి, ప్రకటించేవరకు అస్సలు పైకి తెలియనివ్వకూడదని గుంభనంగా వుంచారు.