సైరా సినిమా కోసం గుబురు గెడ్డం, కోరమీసం పెంచారు హీరో చిరంజీవి. ఒక షెడ్యూలు జరిగింది. ఇంకో షెడ్యూలు స్టార్ట్ చేస్తారు అనుకునేలోగా గెడ్డం తీసేసారు. దీంతో అనేక అనుమానాలు, డిస్కషన్లు. ఎందుకంటే మళ్లీ గెడ్డం పెంచాలంటే కనీసం నెల అయినా పడుతుంది కదా? గెటప్ ఏమన్నా మారుస్తున్నారా? లేక తరువాత షెడ్యూలు ఆలస్యం అవుతుందా? ఇలా చాలా అంటే చాలా అనుమానాలు.
అయితే ఇప్పుడు ఎక్స్ క్లూజివ్ సంగతేటంటే, మెగాస్టార్ గెడ్డం తీసిన రీజన్ వేరే అన్నది. అయితే అది కూడా సైరా సినిమా కోసమే. విషయం ఏమిటంటే, సైరా సినిమాకు చాలా సిజి వర్క్ వుంది. పైగా ఈ మధ్య ఫేస్ లు కూడా సిజిలో కాస్త చెక్కుతున్నారు. ఇలాంటి పని కోసం ముందుగా టోటల్ ఫేస్ ను రకరకాల యాంగిల్స్ లో సిజి నిపుణులు కాప్చర్ చేస్తారు. అలా కాప్చర్ చేసిన వాటిని కంప్యూటర్ లో ఫీడ్ చేసి, వర్క్ చేస్తారు. అదంతా పెద్ద ప్రాసెస్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ కుదరదు.
అయితే ఇక్కడ ఓ సమస్య వుందట. ఇలా ఫేస్ ను రకరకాల భంగిమల్లో కాప్చర్ చేయడానికి గెడ్డం అడ్డం అంట. కానీ ఇప్పుడు అర్జెంట్ గా ఆ పని ఫినిష్ చేయాల్సి వుందట. అందుకే గెడ్డం తీసేసి, ఆ వర్కను ఫినిష్ చేస్తున్నారట. మళ్లీ అప్పుడు గెడ్డం పెంచి, సైరా గెటప్ లోకి వచ్చి, షెడ్యూలు ప్లాన్ చేస్తారు.