ఏ ఆర్ రెహమాన్ అంటే ఒకప్పుడు అద్భుతమైన పాటలు. పది కాలాల పాటు వినపడే పాటలు. రోజా, అమృత ఇలా చాలా చాలా. కానీ ఇప్పుడు రెహమాన్ పాట అంటే నోటికి పట్టదు. జనాల్లోకి వెళ్లదు. ఇటీవల కాలంలో రెహమాన్ ఆల్బమ్ లు ఏమీ కామన్ ఆడియన్స్ కు కిలో మీటర్ల దూరంలో ఆగిపోతున్నాయి.
అయినా ఇంకా భారీ సినిమా అంటే రెహమాన్ మీద దృష్టి వుంటుంది. తెలుగులో సైరా సినిమా అదృష్టం కొద్దీ రెహమాన్ సంగీతం నుంచి తృటిలో తప్పించుకుంది. ఇప్పుడు తమిళనాట మరో సినిమా విషయంలో ఇదే హడావుడి జరుగుతోంది.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో ఇంటలెక్చ్యువల్ డైరక్టర్ మురుగదాస్ ఓ సినిమా చేయబోతున్నారు. దానికి మ్యూజిక్ డైరక్టర్ గా రెహమాన్ ను తీసుకుంటున్నారు. దీనిపై అప్పుడే సోషల్ నెట్ వర్క్ లో గడబిడ ప్రారంభమైపోయింది.
రెహమాన్ వద్దు బాబూ అంటూ ప్రచారం ప్రారంభమైపోయింది. రెహమాన్ వద్దు, అనిరుధ్ ముద్దు అనే టైపులో విజయ్ ఫ్యాన్స్ నో లేదా అనిరుధ్ ఫ్యాన్స్ నో ట్వీట్ లు, పోస్టులు చేస్తున్నారు. మరి మురుగదాస్ ఈ మాట ఆలకిస్తారా? నా మాటే నాది, నా సినిమా, నా ఇష్టం అంటారా? చూడాలి.