మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఆయన గెడ్డం పెంచినా వార్తే. తీసినా వార్తే. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గెడ్డం తీసిన విషయం డిస్కషన్ పాయింట్ గా మారింది. సైరా సినిమా గెటప్ కోసం చిరంజీవి గెడ్డం పెంచిన సంగతి తెలిసిందే. చిన్న టెస్ట్ షెడ్యలు చేసారు. అలా చేయగా వచ్చిన కొద్ది నిమషాల ఫుటేజ్ ను ఎడిట్ చేయించి చూసుకున్నారు.
అంత వరకు ఓకె. అప్పటి నుంచి రకరకాల గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. దర్శకుడు సురేందర్ రెడ్డి వర్క్ తో చిరంజీవి సంతృప్తి గా లేరని, గుణశేఖర్ నో, వివి వినాయక్ నో ప్రాజెక్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారని ఇలా రకరకాలుగా. అయితే అవన్నీ వట్టిదే అని, ఫిబ్రవరి నుంచి తరువాతి షెడ్యూలు వుంటుందని సైరా యూనిట్ ప్రకటించింది.
కట్ చేస్తే… ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి క్లీన్ షేవ్ తో చకచకా గెడ్డం తీసిన లుక్ తో కనిపించారు. దాంతో మళ్లీ గ్యాసిప్ లు ఊపందుకున్నాయి. క్యారెక్టర్ కంటిన్యూనిటీ వుండాలంటే గెడ్డం వుండాలి కదా? మరి ఎందుకు తీసేసినట్లు? మళ్లీ పెరగడానికి చాలా టైమ్ పడుతుంది కదా? మరి ఫిబ్రవరి నుంచి సైరా షెడ్యూలు వుండదా? లేదా టెస్ట్ ఫుటేజ్ చూసుకున్నాక, చిరంజీవి సైరాలో గెటప్ ఏమన్నా మారుస్తున్నారా? ఇలా రకరకాల క్వశ్చన్లు.
మళ్లీ వీటికి సమాధానం చెప్పాల్సింది సైరా యూనిట్ నే. ఏమయినా, మళ్లీ జనాల్లో అదే డవుట్. సైరా విషయంలో ఏదో జరుగుతోంది. అది ఏమటన్నదే క్లియర్ గా బయటకు రావడంలేదు.