పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముస్తాబయిన అజ్ఞాతవాసి సినిమా సెన్సారు ఫార్మాలిటీ పూర్తి చేసుకుంది. ఏ కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చేసారు. ఇది చాలా అంటే చాలా కామన్ గా మారింది దాదాపు గత ఏడాది ఏడాదిన్నరగా.
పెద్ద సినిమా ఏది సెన్సారు ముందుకు వెళ్లినా, వితవుట్ కట్ యు/ఎ తో బయటకు రావడం మామూలే. అజ్ఞాతవాసి కూడా ఆ ఫార్మాలిటీ పూర్తి చేసుకుంది. పైగా త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ కాబట్టి అభ్యంతర సన్నివేశాలు ఏవీ వుండవు. అందువల్ల సెన్సారు స్మూత్ గా జరిగిపోయింది.
రికార్డు స్థాయిలో ఓవర్ సీస్ లో అజ్ఞాతవాసి విడుదలవుతోంది. అన్ని స్క్రీన్ లలో ఓ భారతీయ సినిమా వేయడం ఇదే ప్రధమం. అందుకే ఎటువంటి ఇబ్బందులు రాకూడదని, ముందుగానే సెన్సారు చేయించేసారు. అయితే ఇంకా చిన్న చిన్న పనులు వుండనే వున్నాయి. అవన్నీ ఇవ్వాళ, రేపు ఫినిష్ చేసుకుని, ఓవర్ సీస్ కు కాపీలు లోడ్ చేసే కార్యక్రమం ప్రారంభిస్తారు.