బ్రహ్మాజీకి గుండు కొట్టించిన చిరు?

పాత్ర డిమాండ్ చేస్తే, ఎంతకయినా కష్టపడి నటిస్తారు చాలా మంది నటులు. అలాంటి వాళ్లలో బ్రహ్మాజీ ఒకరు. సరైన బ్రేక్ రాలేదు కానీ, వేసిన ప్రతి క్యారెక్టర్ హిట్ నే బ్రహ్మాజీకి. Advertisement కామెడీని…

పాత్ర డిమాండ్ చేస్తే, ఎంతకయినా కష్టపడి నటిస్తారు చాలా మంది నటులు. అలాంటి వాళ్లలో బ్రహ్మాజీ ఒకరు. సరైన బ్రేక్ రాలేదు కానీ, వేసిన ప్రతి క్యారెక్టర్ హిట్ నే బ్రహ్మాజీకి.

కామెడీని సైతం అద్భుతంగా పండిస్తాడు. అలాంటి బ్రహ్మాజీ ఇప్పుడు గుండు గీయించుకున్నాడట. తలకు గుడ్డ కట్టుకుని తిరుగుతున్నాడట. దీనికి కారణం ఎవరు? సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవేనట.

విషయం ఏమిటంటే, సైరా సినిమాలో నరసింహారెడ్డి పక్కనే ఒక క్యారెక్టర్ వుంటుంది. అది బ్రహ్మాజీ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ సినిమా అంతా గుండుతోటీ, మెలితిప్పిన మీసాలతోటి కనిపిస్తుంది. సరే ఇంక థ్రూ అవుట్ సినిమా అంతా వుండే క్యారెక్టర్ కదా? డిఫెరంట్ గెటప్ కదా? అని బ్రహ్మాజీ క్లీన్ షేవ్ చేయించేసి మీసాల పెంచడం మొదలు పెట్టాడట.