ఇద్దరు హీరోలు-ముగ్గరు హీరోయిన్లు

మీడియం రేంజ్ హీరోల పక్కన ఒక్క హీరోయిన్ దొరకడమే కష్టం. అలాంటిది ఇప్పడు ముగ్గురు హీరోయిన్లు కావాలంట. అది కూడా కెరీర్ ఒడిదుడుకుల్లో వున్న ఇద్దరు హీరోలకు, సబ్జెక్ట్ మంచిది. కాంబినేషన్ బాగుంది. కానీ…

మీడియం రేంజ్ హీరోల పక్కన ఒక్క హీరోయిన్ దొరకడమే కష్టం. అలాంటిది ఇప్పడు ముగ్గురు హీరోయిన్లు కావాలంట. అది కూడా కెరీర్ ఒడిదుడుకుల్లో వున్న ఇద్దరు హీరోలకు, సబ్జెక్ట్ మంచిది. కాంబినేషన్ బాగుంది. కానీ ఎవరు? ఎవరు? సై అంటారు అని వెదుకుతున్నారట ముగ్గురు హీరోయిన్ల కోసం.

సుడిగాడు లాంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడు భీమినేని మరో మాంచి తమిళ సినిమా పట్టుకున్నారు. దీంట్లో అల్లరి నరేష్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్ పక్కన ఇద్దరు, నరేష్ పక్కన ఒక్కరు, టోటల్ గా ముగ్గురు హీరోయిన్లు కావాలట. ఈ పాత్రలు కూడా పోనీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవా, పాటలకు పరిమితం అయ్యేవా అంటే అదీ కాదట. కాస్త పెర్ ఫార్మెన్స్ కు చోటున్న పాత్రలట. 

సో, ఇంకా కష్టమే. కాస్త బాగుండాలి, ఫెర్ ఫార్మ్ చేయాలి. సునీల్, అల్లరి నరేష్ పక్కన చేయడానికి ఓకె అనాలి. సినిమా తీయడం కన్నా దర్శకుడు భీమినేనికి ఇదే కష్టమైన టాస్క్ ఏమో?