రన్నింగ్ లో వున్న రకుల్ కోటికి పైగా అడుగుతోంది. అంటే ఓకె అనుకోవచ్చు కానీ చేతిలో పెద్దగా సినిమాలు లేకున్నా కొటికి తగ్గమంటున్నారు చాలా మంది హీరోయిన్లు. టాలీవుడ్ లో వున్న హీరోయిన్ల కొరత, అలాగే ముదురు హీరోల పక్కన హీరోయిన్ల అవసరం రెండూ క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీంతో అలాంటి వాటికి పనికివచ్చే హీరోయిన్లు కొండెక్కి కూర్చుంటున్నారు.
వెంకటేష్ పక్కన హీరోయిన్ కావాలి? ఎవరు చేస్తారు? కాస్త నోటెడ్ ఫేస్ అయివుండాలి. అందుకే చాయిస్ తగ్గిపోతోంది. కాజల్ ను అడుగుతుంటే కొటి రూపాయలు డిమాండ్ చేస్తోందట. పైగా డేట్ లు తనకు ఖాళీ వున్నవే ఇస్తానంటోందట.
తేజ సినిమాలో వెంకీది మిడిల్ ఏజ్డ్, ఇద్దరు పిల్లల తండ్రి క్యారెక్టర్. మరి ఆ పాత్రకు జోడీగా ఎవరు సూటవుతారు. నయనతార, కాజల్ కాకుండా. ప్రతిసారీ దృశ్యంలో మాదిరిగా నిన్నటి జనరేషన్ హీరోయిన్లను తేలేరుగా. అందుకే కాజల్ అడిగిన కోటి ఇవ్వడానికి రెడీ అయ్యారుట. కానీ డేట్ ల తకరారు తేలడం లేదు.
నిజానికి తమన్నా అయితే 85లక్షలకే రెడీ. ఇప్పటికే కళ్యాణ్ రామ్ పక్కన, సందీప్ కిషన్ పక్కన చేస్తోంది. కానీ వెంకటేష్ సినిమాకు తమన్నా రేంజ్ సరిపోదట. కాజల్ అయితేనే బెటర్ అని అటు చూస్తున్నారట.