పాయింట్ బావుంటే ట్విట్టర్ లో పెట్టేయ్ అన్నట్లుగా టైటిల్ బాగుంటే రిజిస్టర్ చేయించి వుంచితే ఎప్పటికి అయినా, ఎవరికి అయినా పనికి వస్తుంది. అలాంటి ఉద్దేశంతోనే కావచ్చు, లేదా మరేదైనా అయిడియా వుండి వుండొచ్చు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అడవి రాముడు టైటిల్ ను రిజిస్టర్ చేయించిందట.
అయితే ఊరికే చేయించి వుండదు. రానా హిందీలో హాథీమేరీసాథీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఎలాగూ తెలుగులోకి డబ్ చేస్తారు. దానికి అడవి రాముడు టైటిల్ పక్కాగా సూటయిపోతుంది. బహుశా అందుకే చేయించి వుంటారు.
ప్రభాస్ దందా
ఇదిలా వుంటే ఫ్రభాస్ కోసమే కావచ్చు దందా అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసారు. సీనియర్ హీరో కృష్ణంరాజు తన గోపీ కృష్ణా బ్యానర్ పై ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసారట. మాంచి మాస్ టైటిల్ ఇది. ప్రభాస్ లాంటి హీరోకు సూటయ్యేదే. కానీ మరి సబ్జెక్ట్, డైరక్టర్ ఇవన్నీ ఇప్పుడే తెలిసేవి కాదు. ప్రభాస్ సాహో పూర్తవ్వాలి. ఆ తరువాత సంగతి.
ఇదిలా వుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి టైటిల్ కూడా రిజిస్టర్ అయిందట. ఇదెవరి కోసమో మరి. ఇది అలనాటి సూపర్ టైటిల్ కదా? రిజిస్టర్ చేయించి వుంటే ఎవరికైనా పనికి వస్తుంది. అందుకే చేయించి వుంటారు.