టాలీవుడ్‌లో మల్టీస్టారర్ల హవా

తెలుగు సినిమాలో అంతరించిపోయిన మల్టీస్టారర్ల ట్రెండ్‌ నెమ్మదిగా ఊపందుకుంటోంది. స్టార్‌ డైరెక్టర్లు, హీరోలు కూడా ఇప్పుడు మల్టీస్టారర్ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్‌, చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేయడంతో ఈ ట్రెండ్‌కి ఊపొచ్చింది.…

తెలుగు సినిమాలో అంతరించిపోయిన మల్టీస్టారర్ల ట్రెండ్‌ నెమ్మదిగా ఊపందుకుంటోంది. స్టార్‌ డైరెక్టర్లు, హీరోలు కూడా ఇప్పుడు మల్టీస్టారర్ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్‌, చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేయడంతో ఈ ట్రెండ్‌కి ఊపొచ్చింది. ఈ చిత్రం తెర మీదకి రావడానికి ఇంకా సమయం వుండగా, ఈలోగా పలువురు దర్శకులు మల్టీస్టారర్లు సిద్ధం చేస్తున్నారు.

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌తో అనిల్‌ రావిపూడి తన తదుపరి చిత్రం చేయబోతున్నాడు. శర్వానంద్‌, నితిన్‌తో హరీష్‌ శంకర్‌ 'దాగుడు మూతలు' ఆడబోతున్నాడు. త్రివిక్రమ్‌ కూడా ఒక మల్టీస్టారర్‌ కథని సిద్ధం చేసాడు. వెంకటేష్‌తో అనౌన్స్‌ చేసిన సినిమా మల్టీస్టారరే అనే టాక్‌ బలంగా వినిపిస్తోంది.

ఇది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన, ఆర్థికదాయకమైన ట్రెండే. ఇద్దరు హీరోలు జత కడితే ఆ సినిమాపై అంచనాలు ఆటోమేటిగ్గా ఏర్పడతాయి. ఇద్దరు హీరోలని కలిపి రాసే కథల్లోను స్టఫ్‌ లేకుండా పోదు. ఎలా చూసినా రానున్న రెండు, మూడేళ్లలో తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చేసే దిశగా మల్టీస్టారర్ల ట్రెండ్‌ జోరందుకుంది.