ఎప్పుడో తను హీరోయిన్ గా ఊపు మీద ఉన్నప్పుడు ఒకటీ రెండు సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది కాజోల్. ఆ తర్వాత పెళ్లి చేసుకుని బిజీ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో చాలా కాలం నుంచినే నటిగా కొనసాగుతూ ఉంది.
పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించడానికి కూడా వెనుకాడలేదు. అయినప్పటికీ పక్కా హద్దుల్లో నటిస్తున్నట్టుగా కనిపించిన కాజోల్ కూడా వెబ్ సీరిస్ ల వేడి నుంచి తప్పించుకోలేకపోయినట్టుగా ఉంది.
ది ట్రయల్ అనే వెబ్ సీరిస్ లో నటించిన కాజోల్ అందులో రెండు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. ఇప్పుడు ఇంటర్నెట్ లో అవి వైరల్ గా మారాయి. ఓటీటీలోకి ఆ సీరిస్ అలా రాగానే.. కాజోల్ లిప్ లాక్ సన్నివేశాలను నెటిజన్లు లీక్ చేశారు. ఇన్ స్టాగ్రమ్ లో, ఫేస్ బుక్ లో ఎక్కడ చూసినా.. షార్ట్స్ గా, రీల్స్ గా దాన్ని పోస్ట్ చేసేస్తూ ఉన్నారు. ఇలా ఆమె లిప్ లాక్ వైరల్ గా మారింది.
సుదీర్ఘమైన చుంభనం కాకపోయినా.. చీరకట్టులో కనిపించిన కాజోల్ ఉన్నట్టుండి ఇలాంటి సన్నివేశాల్లో కనిపించడంతో అవి వైరల్ అవుతున్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ వెబ్ సీరిస్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు ఆమె భర్త అజయ్ దేవగణ్.
ఇలా హోం ప్రొడక్షన్ కావడంతో.. దాన్ని హిట్ చేయడానికి కాజోల్ రాజీ పడకుండానే నటించినట్టుగా ఉంది. ఈ ముద్దు చిత్రీకరణ సమయంలో మొహమాటాలు , ఇబ్బంది ఏమీ లేదని.. నటించేశామని ఆమెను ముద్దాడిన నటుడు చెబుతున్నాడు. మొత్తానికి కాస్త లేటు వయసులో కాజోల్ లిప్ లాక్స్ తో వైరల్ అవుతోంది.