మెగా అల్లుడి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ తో నిర్మాత సాయి కొర్రపాటి ఓ సిన్మా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. జతకలిసే అనే ఫ్లాప్ సినిమా అందించిన రాకేష్ శశి అనే డైరక్టర్ తయారుచేసిన కథనే ఇప్పుడు ఈ సినిమా కోసం తీసుకున్నారు. కథ మెగాస్టార్ కు నచ్చిందని తెలుస్తోంది. అంటే బాగానే వుండి వుండాలి అనే అనుకోవాలి.
కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏమిటంటే, అదే కథను హీరో నిఖిల్ కు చెప్తే రిజెక్ట్ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయి కొర్రపాటి, ఇధే డైరక్టర్ తో ఆ కథను ముందుగా హీరో నిఖిల్ కు చెప్పించినట్లు తెలుస్తోంది. కానీ ఇది తనకు సూట్ కాదని నిఖిల్ స్మూత్ గా రిజెక్ట్ చేసినట్లు వినికిడి. ఫాదర్-సన్ సెంటిమెంట్ తో కూడిన కథ కావడంతో తనకు ఇలాంటి సెంటిమెంట్ జోనర్ నప్పదని నిఖిల్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఆ కథనే మెగా అల్లుడు కళ్యాణ్ ఓకె చేసి, మామగారికి కూడా వినిపింపచేస్తే, ఆయన ఒకె అన్నారని తెలుస్తోంది. అంటే ఫస్ట్ సినిమాను మెగా అల్లుడు మాస్ జోనర్ లో కాకుండా ఫ్యామిలీ జోనర్ లో చేయబోతున్నట్లు కనిపిస్తోంది.