పండగ తరువాత తొక్కిడే తొక్కిడి

సంక్రాంతి పండగకు సూర్య గ్యాంగ్, బాలయ్య జై సింహా, రాజ్ తరుణ్ రంగులరాట్నం వున్నాయి. అప్పటికే అజ్ఞాతవాసి థియేటర్లలో వుంటుంది. అంటే టోటల్ గా నాలుగు సినిమాలు. కానీ ఈ సినిమాల జోరు అక్కడితో…

సంక్రాంతి పండగకు సూర్య గ్యాంగ్, బాలయ్య జై సింహా, రాజ్ తరుణ్ రంగులరాట్నం వున్నాయి. అప్పటికే అజ్ఞాతవాసి థియేటర్లలో వుంటుంది. అంటే టోటల్ గా నాలుగు సినిమాలు. కానీ ఈ సినిమాల జోరు అక్కడితో ఆగడం లేదు. సంక్రాంతి వెళ్లిన తరువాతి వారం కూడా సినిమాలు బారులు తీరుతున్నాయి.

అనష్క భాగమతి, కమల్ హాసన్ విశ్వరూపం 2, సందీప్ కిషన్ మనసుకు నచ్చింది, విశాల్ అభిమన్యుడు ఇలా మొత్తం నాలుగు సినిమాలు రెడీగా ఫిక్సయివున్నాయి. వీటికి తోడు మంచు విష్ణు-నాగేశ్వర రెడ్డిల ఆచారి అమెరికాయాత్ర కూడా వస్తోంది.

ప్రముఖ రచయిత మల్లాది అందించిన కథతో తయారవుతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. అంటే జనవరి మొత్తం మీద ఎనిమిది చెప్పుకోదగ్గ సినిమాలు అన్నమాట. వాటిల్లో అయిదు ఒకేరోజు జనవరి 26నే. 

మళ్లీ వారం తిరక్కుండానే ఫిబ్రవరి 2ను కాస్త ఖాళీగా వదిలేసి 9వ తేదీ మీద పడ్డారు. ఇద్దరు మెగాహీరోలు వరుణ్, సాయిధరమ్ ల్లో ఎవరో ఒకరి సినిమా, మోహన్ బాబు గాయత్రి, నాగశౌర్య ఛలో, నిఖిల్ కిర్రాక్ పార్టీ వుండే అవకాశం వుంది. వీటిల్లో ఒకటి తగ్గినా మూడు సినిమాలు అయితే ఫిక్స్. అంటే జనవరి 10నుంచి ఫిబ్రవరి 14వరకు థియేటర్లు సినిమాలతో కిటకిట లాడబోతున్నాయన్నమాట.