నిజమే.. నిత్యం అదే పనిగా టీవీ చూసే పురుషులు సెక్స్ కు పనికిరావు. ఇండియాలో తాజాగా నిర్వహించిన సర్వేలో తేలిన అంశమిది. రోజుకు 5గంటలకు మించి టీవీ చూస్తే 35శాతం వీర్యంలో తగ్గుదల కనిపిస్తోందని సర్వేలో తేలింది. అంతేకాదు.. గుండె జబ్బులు వచ్చే అవకాశం 45శాతం ఎక్కువని తేల్చింది.
ఇదే సంస్థ గతేడాది నిర్వహించిన సర్వేలో వారానికి 20గంటలకు మించి టీవీ చూస్తే వీర్య కణాల సంఖ్య సగానికి తగ్గినట్టు గుర్తించింది. అయితే ఏడాది గ్యాప్ లోనే తమ సర్వే నంబర్లను సవరించి.. గంటకు 5 గంటలకు మించి టీవీ చూస్తే 35శాతం వీర్య కణాలు తగ్గిపోతున్నాయని తేల్చింది.
ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ కు చెందిన ఐవీఎఫ్ నిపుణులు, సెక్స్ స్పెషలిస్టులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ, అతిగా టీవీ చూడడం వల్ల వీర్య కణం ఆకృతి, సైజు తగ్గిపోవడాన్ని గుర్తించింది. భవిష్యత్తులో ఇది మగాడి పటుత్వాన్ని దెబ్బతీస్తుందని తేల్చింది. ఇక టీవీని చూస్తూ అదేపనిగా జంక్ ఫుడ్ తినేవాళ్లయితే జీవితం మీద ఆశలు వదులుకోవాలని స్పష్టంచేసింది సర్వే.
18నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న 2వందల మంది విద్యార్థుల నుంచి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా ఈ సర్వే రిపోర్ట్ తయారుచేసింది సదరు సంస్థ. రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా టీవీ చూసే వ్యక్తుల్లో 90శాతం వీర్యకణాలు తక్కువ టైమ్ లో చనిపోతున్న విషయాన్ని ఇది గుర్తించింది.